Wednesday, May 12, 2010
గాంధీలు పుట్టిన దేశం
ఈ వ్యాసం ఎవ్వరినీ సంస్కరించక పోవచ్చు. కానీ మన చేతగానితనానికి అద్దం లాంటిది.
ఇక్కడ పూర్తి వ్యాసం చూడండి
Monday, April 12, 2010
ఎదురు చూపులు
వెళుతూ తిరిగిచూస్తావని!
మౌన గీతం వినిపిస్తే
మనసు కరిగి వస్తావని!
కనుల చెమ్మకు కరువేముంది
సముద్రాన నీటి బొట్లలా!!
Thursday, April 8, 2010
పాట్లు-నోట్లు
మట్టి కంపుతో ఇంటికొస్తే....!
ఇంటి ఎదురుగా సారాయి షాపాయే,
ఇంటి వెనుక లాటరీ మట్కా ల గోలాయే
కూలి సొమ్ము వాటి పాలాయె
ఇంటి ఇల్లాలికి పాట్లాయే...
మన ప్రభుత్వానికి నోట్లాయే..
నా ఉనికి
ప్రొద్దుతిరుగుడు పువ్వునై నిన్ననుసరిస్తా
మబ్బుల చాటున నువ్వు దాక్కుంటే
అచేతనంగా నాలో నేనే ముడుచుకుపోతా...!
నీ అడుగులో అడుగేస్తుంటే
ప్రపంచం అంచులదాకా నడుస్తానన్న విశ్వాసం
నువు కనుమరుగై నే ఒంటరినయితే
నా ఉనికే నాకు తెలియని ప్రశ్నార్థకం...!
Thursday, April 1, 2010
పాసుపోర్టు : నా తిప్పలు
చెన్నయ్ పాసుపోర్టు ఆఫీసుకి వెళ్ళటం తోనే నా గుండె ఆగినంత పనయింది... ఆరు వరుసలలో కొన్ని వేలమంది ఉన్నారు... చాలా మంది ఉదయాన్నే 6 గంటలకు వచ్చారట.. మనం మాత్రం తీరికగా 10 గంటలకి వెళ్లాం. నా వాహనాన్ని ఒక చోట నిలిపి, తక్కువగా జనాలు ఉన్న వరుసలో నిలుచున్నా... ఆ వరుస మొదటి అంతస్తు వరకూ ఉంది. తీరా అక్కడికి వెళ్తే.. ఇది త్వరితగతిన పాసుపోర్టు ఇచ్చే (Tatkaal Passport) వరుస అని వెనక్కి పంపించారు. త్వరితగతిన పాసుపోర్టు ఇచ్చే పద్దతికి రూ.2500 మామూలు పద్దతికి రూ.1000 ఖర్చవుతుంది. అక్కడ ఎటువంటి సమాచారమిచ్చే బోర్డులు కానీ మనుషులు కానీ కనిపించలేదు.
నా అదృష్టం బాగుంది, ఎవరో తెలుగులో మాట్లాడుతున్నారు... ( మనకి తమిళం అంతంత మాత్రం వచ్చు) వాళ్ళ దగ్గరికి వెళ్లి నా భాద చెప్పా... వాళ్ళు ఏ వరుస ఎందుకో చెప్పారు.
- వరుస 1: త్వరితగతిన పాసుపోర్టు ఇచ్చే (Tatkaal Passport) వరుస లేదా ముసలి వాళ్లకి, 3 సంవత్సరాలకంటే చిన్న వయసున్న పిల్లలకి సాధారణ పాసుపోర్టు ఇచ్చే వరుస
- వరుస 2: పాసుపోర్టు విచారణ వరుస
- వరుస 3: పాసుపోర్టులు ఇవ్వటానికి అవసరమయిన పరిశీలనా వరుసలో కి వెళ్ళటానికి టొకనులు ఇచ్చే వరుస. యీ వరుసలో ఇచ్చే తోకను మీద ఆంగ్ల అక్షరాలయిన "Ordinary P","Ordinary Q","Ordinary R", "Tatkaal P","Tatkaal Q","Tatkaal O" లు ఉంటాయి. అన్నీ తత్కాల్ (Tatkaal ) టొకను వాళ్ళు వరుస 1 కి వెళ్ళాలి.
- వరుస 4: "Ordinary P" వాళ్ళ వరుస
- వరుస 5: "Ordinary Q" వాళ్ళ వరుస
- వరుస 6: "Ordinary O" వాళ్ళ వరుస
కొంత సేపటికి మరలా పాసుపోర్టు ఆఫీసర్ల భోజనాల తరువాత వరుస 4 మొదలయ్యింది. నా వంతు వచ్చింది. ఒక ముసలావిడ కూర్చొని ఉంది. నా దరకాస్తు చూసి, ఏదో ఒక ఫోటో కాపీ మీద సంతకం లేదని, విసిరికొట్టింది. మరలా వరుస బయటకి. ... ఆ సంతకమేదో పూర్తిచేసి, మరలా అక్కడున్న కాపలాదారుని బ్రతిమలాడి, లోపలి వెళ్ళా.... ఈ సారి, నా పాసుపోర్టు హైదరాబాదు లో ఇచ్చారు కాబట్టి , రెండవ అంతస్తులో ఇంకొక ఆఫీసరు దగ్గరకి వెల్లి చూపించి స్టాంపు వేయించుకొని రమ్మంది.
తిరిగి మొదటికి..ఆ స్టాంపు వేయించుకొని వచ్చా... ఈ సారి కాపలాదారుని బ్రతిమలాడినా ప్రయోజనం లేక వరుసలో నించున్నా... నా వంతు వచ్చింది. ఆవిడ అన్నీ చూసి Appedix I (https://passport.gov.in/cpv/ANNEXUREI_std.htm) లేదు , కనుక త్వరగా 10 నిమిషాలో చేయించుకు రమ్మంది. బయటకి వచ్చి, కాపలాదారుని ఎలా అని అడిగితే, ఆఫీసు ఎదురుగా ఉన్న ఒక నోటరీ బోర్డు చూపించాడు. అక్కడికిది పరుగుపరుగున వెళ్ళి ఆ పనేదో కానిచ్చి వచ్చేసరికి, పాసుపోర్టు ఆఫీసర్లు తాళాలు వేసి బయటకి వస్తున్నారు. నన్ను చూసి, ఆగి "Verified" అనే స్టాంపు వేసి వెళ్ళి ఫీజు ( Fee) కట్టమన్నారు. ఫీజు రెండవ అంతస్తులో కట్టాలి. అక్కడికి వెళ్ళేటప్పటికి, ఆ విభాగం మూసివేసారు.
చేసేది లేక, రెండవ రోజు, వెళ్ళి ఫీజు కట్టి, దరకాస్తు ఇచ్చి వచ్చా.
ఇవండీ నా తిప్పలు .
Wednesday, February 24, 2010
బాల్యం కావాలి
ఉద్యమాల నినాదాలు, స్త్రీవాదం జాడలూ
దరికేవీ చేరని దూరతీరాల జీవితం కావాలి
ఏటి గట్టు, నీటి బిందె
మట్టి దోవా, ఊరిసేవా జీవితం కావాలి
తాను కోల్పోయిందేదో, పొందిందేదో తనకే తెలియని బాల్యం కావాలి.
Saturday, February 20, 2010
నీ స్నేహం...
నా ఊపిరితో ఊపిరి పోసుకొన్న ఈ రాగానికి
కనుచూపుమేరా పచ్చదనం వెల్లివిరుస్తుందనీ
అడుగడుగునా ఆమని విరబూస్తుందనీ
ఎన్ని ప్రశంసలు .. ఎన్ని పొగడ్తలు....
ఎన్ని అభినందనలు... ఇంకెన్ని ఆశీర్వచనాలు...!
ఎవరేమన్నా నేస్తం... నా మనసుకి తెలుసు
ఈ గానానికి గమ్యం.. నన్ను సేదదీర్చే నీ హృదయం
ఈ స్వరార్చన లక్ష్యం... బతుకును వెలిగించే నీ స్నేహం...!
Wednesday, February 17, 2010
నమ్మకం
నమ్మకమే నేస్తమయినప్పుడు
ఆకురాలు కాలంలోనూ
ఆమనిగీతం వినిపిస్తుంది!
నమ్మకాలు వమ్మైనప్పుడు
తోడయిన నీడ సైతం
నువ్వెవరని ప్రశ్నిస్తుంది...!!!
Tuesday, February 16, 2010
కట్నం ఎంతిస్తారు?
"చూడు బాబూ... నాకు మొగుడు లేడు. పెళ్ళికి ఎదిగిన కూతుర్లు ఉన్నారు. నువ్వా... బ్రహ్మచారివి. నేనా ముసలిదానిని.. పెళ్ళికొడుకుల కోసం తిరగలేను. కాబట్టి నువ్వు మా అమ్మాయిలలో ఎవరినయినా చేసుకొంటే తగిన కట్నమిస్తాను"
"కట్నం ఎంతిస్తారు?"
" అది నువ్వు చేసుకొనే అమ్మాయి మీద ఆధారపడి ఉంటుంది. మా ఆఖరి అమ్మాయి వయసు ఇరవై. దాన్ని చేసుకొంటే ఐదు లక్షలిస్తాను. దాని పైదాని వయసు ఇరవై ఐదు. దాన్ని చేసుకొంటే పది లక్షలిస్తాను. దాని పైదాని వయసు ముప్పై. దాన్ని చేసుకొంటే పన్నెండు లక్షలిస్తాను. దాని పైదాని వయసు ముప్పై ఐదు. దాన్ని చేసుకొంటే పదిహేను లక్షలిస్తాను. "
"అలాగా.. ! అయితే మీకు నలభయ్ ఐదు వయసుండే అమ్మాయిలు లేరా??" అని ఆశగా ప్రశ్నించాడతాను. :-)
మనసు రాయబారం
రాయబారం కోసం వస్తోంది
ఆశల అంచులపై పయనించే రాయంచ...!
నీ పలకరింపుల చినుకులతో పునీతం చేస్తావో...
కసి చూపుల జడివానలో ముంచేస్తావో....
ఏదయినా నేస్తం...
తిరుగు సందేశం మాత్రం నన్ను చేరనీ..!!!
Sunday, December 6, 2009
ఏమంటివి! ఏమంటివి!
కాదు.. కాకూడదు.. ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జననమేట్టిది?
అతి జుగుప్సాకరమయిన నీ జననమెట్టిది?
మట్టి కుండలో పుట్టితివికదయ్యా! నీది ఏ కులము?
ఇంత ఏల! అస్మద్పితామహుడు, కురుకుల వ్రుద్దుడయిన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యఐన గంగ గర్భమున జన్మించలేదా? ఈయనదే కులము?
నాతొ చెప్పింతురేమయ్యా! మా వంశమునకు మూలపురుషుడైన వసిష్టుడు దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాడా?
అతడు పంచమ జాతి కన్య ఐన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగనయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచు అయిన మత్స్యగ్రంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాన్డ్రయిన మా పితామహి అంబిక తో మా తండ్రిని, పిన పితామహి అంబాలిక తో మా పిన తండ్రి పాండు రాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మానజనుదని మీచే కీర్తింప బడుతున్న ఈ విదుర దేవుని కనలేదా?
సంధర్భావసరముల బట్టి మా కురువంశము ఏనాడో కులహీనమయినది. కాగా నేడు కులము కులము అను వ్యర్ధ వాదములెందులకు?
పైన చెప్పిన అన్న NTR Dialog గుర్తుంది కదా.... ఆలాంటి పేరడీ మీ కోసం...
ఏమంటివి! ఏమంటివి!
బగ్గు నెపమున ఈ మృదుపరికరణ నిపుణునికి (Software Proffessional)ఇంద కొలువ చెయ్యలేద అర్హత లేదందువా?
ఎంత మాట! ఎంత మాట! !
ఇది యూనిట్ టెస్టింగు (Unit Testing) కానీ, యూసర్ యాసెప్టెన్స్ (User Acceptance Testing) టెస్టింగు కాదే!!
కాదు! కాకూడదు!! ఇందు బగ్సు రాకూదదండువా? ఆ??
అయిన ఈ ప్రాజెక్టు లీడు కోడింగు ఎట్టిది? అతి జుగుప్సాకరమయిన నీ కోడింగు ఎట్టిది? గూగుల్ లో కాపీ కొట్టితివికదా!! నీది ఏమి కోడింగు???
ఇంత ఎల?? మన కంపెనీ పితామహుడు, సాఫ్టువేరు కురువృద్ధుడయిన మన సిఈఓ (CEO) బగ్సు ఫిక్ష్సు చేయలేక వేరే కంపెనీ నుండి పారిపోయి రాలేదా? ఆయనదే కోడింగు??
నాతొ చెప్పింతురేమయ్యా! ఈ కోడింగు మొదలు పెట్టిన నువ్వు వర్షను 1.1 ను, దానిని ఫిక్సు చేసిన నీ టియల్ (TL).. వర్షను 1.2 ను, అందులో బగ్సు ఫిక్ష్సు చేసిన పీయల్(PL).. వర్షను 1.3 ను తయారు చెయ్యలేదా?
సంధర్భావసరముల బట్టి కాష్టు కట్టింగు (Cost Cutting) ప్రాధాన్యతలను బట్టి ఏ కోడు ఏనాడో బగ్సు పరమయినది. కాగా నేడు బగ్గు, బగ్గు అను వ్యర్ధ వాదములెందులకు???
Tuesday, February 3, 2009
కాపీ కవిత ( కౌముది నుంచి )
పొలం గట్టున పనిచేస్తుంటే
చిలక పలుకుల పలకరింపులు!
డొంక దారిలో నడుస్తుంటే
గాలి ఈలల చిలిపి చేష్టలు!
వెనక వస్తూ వేధిస్తావ్!
కంటబడక కవ్విస్తావ్!!
Friday, January 16, 2009
ఏమున్నదక్కొ!! ఓఓ! ఎమున్నదక్కా…
ఈ సరదా పాట చూడండి...
ఏమున్నదక్కొ!! ఓఓ! ఎమున్నదక్కా…
పొట్ట పెరిగిపొయి..జుట్టు రాలిపొయి…
వున్న పరువు పొయి..
ఈ ఇండస్త్రీ లొ నాకింక ఎమున్నది అక్కో.. ఎమున్నది అక్కో ఎమున్నది అక్క..
బి.టెక్కు చేసినాక (సామి)
హైదరాబాదు చేరుకున్నా(సామి)
ఎక్స్పీరియన్సు అడుగుతుంటే ఏఏఏ ఆ ఆఅ ఆఅవ్
ఎక్స్ పీరియన్సు అడుగుతుంటే , ఎంత కావలి అంటే అంత పెట్టి,
జాబ్ కొట్టినా, జాయిన్ అయ్యినా బాంచాన్
(ఏమున్నది అక్కో..)
ట్రైనింగు లు ఇవ్వక పాయె (సామి)
క్లయింటు ఇంటర్యాక్షన్ అన్నడు (సామి)
కమ్యూనికేషను బాలేదు అంటే అ ఆ
ఆఅకమ్యూనికేషను బాలేదు అంటే, కుమిలి కుమిలి ఏడిచినా,
హిందు పేపరు వేయించినా బాంచాన్
(ఏమున్నది అక్కో..)
ప్రాజక్టు ఇచ్చిండు వాడు(సామి)
పేస్లిప్పు కూడ వచ్చింది(సామి)పేస్లిప్పు చూపించీ. అ అ అ అ అ అ
ఆఆఆఆపేస్లిప్పు చూపించిన, క్రెడిట్ కార్డు తీసుకున్న,
అవసరం లేనివి అన్నీ కొన్నా అప్పుల పాలు ఐనా బాంచాన్…
(ఏమున్నది అక్కో..)
ప్రాజక్టు అయిపోఇందీ(సామి)
కొత్తది వస్తాది అన్నడు (సామి)బెంచి లో పెట్టాడు ఆఆ అ ఆ
ఆఆఅబెంచి లో పెట్టినాక సబ్జక్తు మరిచిపోయిన,
ఓ రోజున హెచార్ పిలిచిండు పొయి కలిసినా బాంచాన్….
(ఏమున్నది అక్కో..)
బూం తగ్గింది అన్నాడు (సామి)
కాస్టు కట్టింగ్ అన్నడు (సామి)..
బెంచిలో వున్నా అని చెప్పీ ఆఆ అ అ అ అ
ఆఆబెంచి లో వున్నా అని చెప్పి బయటికి తొసాడు..
కొంప కూల్చాడు బాంచాన్…
(ఏమున్నది అక్కో..)
Sunday, January 11, 2009
తెలుగు బ్లాగు సేవలో పునరంకితమవుతూ...
Wednesday, January 7, 2009
ఏమయింది మన సత్యంకి?
Tuesday, January 6, 2009
Friday, September 5, 2008
షాంబర్గ్ లో చివరి రోజు
Friday, August 15, 2008
ఆత్మ కధలు
ఈ మధ్య నా జుట్టు ఎలా ఊడుతుందో అంతకంటే ఎక్కువగా "ఆత్మ కధలు" చూస్తున్నా. మన అద్వానీ గారి దగ్గర నుంచి ప్రక్కన ముషరాఫ్ గారి వరకు. వీళ్ళందరికీ డబ్బులు ఉండబట్టి అచ్చేసుకోగాలుగు తున్నారు... నాకూ కొద్దో గొప్పో డబ్బులుంటే నేనూ అలాగే చేద్దును అన్నాడు మా స్నేహితుడు ఒకడు...
"నా జీవితం చదివి పక్కవాళ్ళు బాగుపడతారు" అని "ఆత్మ కధలు" వ్రాసే మహానుభావులని ప్రక్కన పెడితే... నా ఉద్దేశంలో ప్రతి ఒక్కడికీ తనగురించి పక్క వాడు వినాలని ఉంటుంది. కొంత మంది సొంత డబ్బాతో వినిపిస్తారు... కొద్దిగా రాత తెలిస్తే.. ఇలా పుస్తకాలు రాస్తారు. ఇవి రెండూ చెయ్యలేని వాళ్ళు ముసల్లోల్లయ్యాక "మా కాలం ఐతే ... " అనో లేక "నేను నీ వయసులో ఉన్నప్పుడయితే" అనో మనవాళ్ళ దగ్గర చెప్పుకొంటారు.
మొత్తం మీద ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆత్మ కధల్ని ఎలాకోలాగా చెప్పుకొంటూనే ఉంటారనే నిజం నాకు అర్థమయింది...
Sunday, July 20, 2008
సి.పి.బ్రౌను తెలుగు-ఆంగ్లము పదకోశం
Saturday, July 12, 2008
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
చరణం: కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలలో కన్నీటి జలపాతాలలో
నాతో నేను అనుగమిస్తు నాతో నేనె రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రంగవల్లుల్నీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
చరణం: మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
చరణం: గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హ్రుదయమే నా లోగిలి
నా హ్రుదయమే నా పాటకి తల్లి
నా హ్రుదయమే నాకు ఆలి
నా హ్రుదయములో ఇది సినీవాలి
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం
Sunday, July 6, 2008
మనో మందిరం
అంతర్మనస్కనై, మనో మందిరం లోకి
తొంగి చూసినప్పుడు
ఏకాంతం నేస్తమై నిలచింది.
బహురూపాలు, పలు రూపాలు...
అన్నీ.. నాలో నేనై .. నాకే నేనై..!
ఆగిపోని అలజడి రేపిన వెలుగు వెల్లువలో
కనులు తెరిచినప్పుడు
సమస్త లోకం బిందువై తోచింది.
రూపాలన్నే ఒకటై, భావాలన్నీ ఏకమై...
నేనే నువ్వై, నువ్వే నేనై...!
చిగురంత ఆశ
కడలి నడుమ పడవ మునిగితే!
కడదాకా ఈదాలి....!!
నీళ్లులేని ఎడారిలో!
కన్నీళ్ళయినా తాగి బతకాలి!!
ఏ లోటు లేనినాడు!
నీ నీడే నీకు తోడు!!
జగమంత దగా చేసినా!
చిగురంత ఆశ చూడు..!!
Saturday, June 28, 2008
మాకూ ఒక భాష కావాలి!
Monday, June 9, 2008
Sunday, June 8, 2008
మౌనం గానే ఎదగమని......
చంద్రబోసు గారి రచన లో... యెం.యెం.కీరవాణి గారు స్వరపరచిన ఈ అద్భుతమయిన నాకు నచ్చిన పాట మీకోసం!!
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది!
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది!!
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది!
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది!!
దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా...
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా!
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా...
బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా!
సాగర మధనం మొదలవగనే విషమే వచ్చింది!
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది!!
అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది
తెలుసుకుంటె సత్యమిది!
తలచుకొంటే సాధ్యమిది!!
చెమట నీరు చిందగా... నుదుటి రాత మార్చుకో!
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో!!
పిడికిలీ బిగించగా... చేతి గీత మార్చుకో!
మారిపోని కధలే లేవని గమనించుకో!!
తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు!
నచ్చినట్టుగ నీ తలరాతను నువ్వే రాయాలి!!
నీ ధైర్యాన్నే దర్శించి దైవాలే తలదించగా!!!
నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా!!!
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి!
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి!!
Wednesday, June 4, 2008
మాతృ భాష - ప్రాధాన్యత
Tuesday, June 3, 2008
భావన
కలసిన మనసుల జత నర్తనలో
అర్థరాత్రి అయినా అరుణోదయమే!
మమతల మల్లెల పందిరి క్రింద
తుఫాను హోరయినా మోహన రాగమే!!
Friday, March 28, 2008
జనార్థన మహర్షి వెన్నముద్దలు:
జనార్థన మహర్షి వెన్నముద్దలు:
మంగళ సూత్రం
మంగళ సూత్రన్ని
మెడకే ఎందుకు కడతారో?
మనసుకి మెదడుకి మధ్య
కబడ్డీ గీతలాగా...
పట్టుకెళ్ళాడు
అంత బరువు డబ్బు
హుండీలో బిడ్డ పుడితే వేస్తానని
తిరుపతి వెంకటేశుడికి
మొక్కుకొన్నాడు.
ఆడపిల్ల పుట్టింది
మొక్కు మరిచాడు
అమ్మాయి పెళ్ళికి
వడ్డీతో సహా
శ్రీనివాసరావు తో
అల్లుడి రూపంలో
పట్టుకెళ్ళాడు.
వివాహానికి పునాదులు:
శివధనస్సు విరిగితేనే
సీతకి రాముడు
మొగుడయ్యాడు
చేప పిల్లని చంపాకే
అర్జునునికి ద్రౌపతి పెళ్ళామయ్యింది
విధ్వంసాలే వివాహానికి
పునాదులు.
you may access the full content from TelugulO.COM
Sunday, March 23, 2008
నా కోసం ఎవరు ఏడుస్తారు??
నిన్న పెరుగు పచ్చడి కోసం ఉల్లిపాయలు (నెల్లూరు ప్రాంతం లో ఎర్రగడ్డలంటారు కూడా) తరుగుతుంటే కళ్ళలో నీరు ధారాపాతం గా కారటం మొదలు పెట్టింది. నేను ఎందుకు ఏడుస్తున్నానొ అని మా రూమ్మేటులు (మా ఆవిడ రెస్టుకోసం ఇండియా కి వెళ్ళింది లేండి) కంగారు పడ్డారు. విషయం తెలిసి నవ్వి ఊరుకొన్నారు.
ఈ ఉల్లిపాయల గురించి 20 సంవత్సరాల క్రితం మా నాన్నమ్మ చెపుతుంటే ఒక కధ విన్నాను. ఆ కధ మీ కోసం.
అనగనగా ఒక ఉల్లిపాయ, ఒక టమోటా మరియు ఒక బంగాళాదుంప (కొన్ని ప్రాంతాలలో ఉర్లగడ్డ అంటారు లేండి) కలసి సముద్ర స్నానానికి వెళ్ళాలనుకొన్నాయి. సరే! బయలుదెరాయి... ఇంతలో ఆ సముద్రం దగ్గర జనాలు ఎక్కువగా ఉండి మన టమోటా గారిని తొక్కేసారు. అయ్యో!! టమోటా!!! నీకప్పుడే నూరేళ్ళూ నిండిపోయాయా?? అని ఉల్లిపాయ, బంగాళాదుంప ఏడవటం మొదలు పెట్టాయి. కొంతసేపటి తరువాత తేరుకొన్నాయి. సముద్ర స్నానాన్ని మొదలు పెట్టాయి. ఇంతలో బంగాళాదుంప కి ఈత రాక మునిగిపోయింది. ఉల్లిపాయ ఏడవటం మొదలు పెట్టింది. అయ్యో!! బంగాళాదుంపా!!! నీకప్పుడే నూరేళ్ళూ నిండిపోయాయా?? అని... ఇంతలో ఉల్లిపాయకి ఒక డౌటు వచ్చింది. టమోటా చనిపోతే నేను, బంగాళాదుంప ఏడ్చాము. బంగాళాదుంప చనిపోతే నేను ఏడ్చాను. మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు? అని. సరే భగవంతుణ్ణి ప్రార్ధించింది. నేను చనిపొతే ఏడ్చెవాళ్ళు కావాలి అని. నీకోసం ఏడ్చెవాళ్ళని సృష్టిస్తే, వాళ్ళు చస్తే ఏడ్చెవాళ్ళని ఎక్కడనుంచి తీసుకురాను అని ఆలోచించి, సరే నిన్ను ఎవరైనా చంపితే వాళ్ళే ఏడుస్తారు అని వరమిచ్చాడట. అప్పటి నుంచి మనం ఉల్లిపాయలు తరిగిన ప్రతిసారీ ఏడుస్తాము. :-)
Saturday, March 22, 2008
హుర్రే!!!
హుర్రే!!!నేను నా నాలుగు సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేసాను. ఇంతకీ నేను ఏమి సాధించానో అని చూస్తే నాకు ఎమీ కనిపిచలేదు...హుర్రే!!! ఏమీ సాధించ కుండా నాలుగు సంవత్సరాలు గడపడం సామాన్యమా చెప్పండి...?? అందుకే ఎవ్వరూ సాధించలేనిది నేను సాధించానని ఎగిరి గంతేస్తూ హుర్రే!!! అని అరిచాను.
ఇంతలోనే నాలాగా నాలుగేళ్ళు పనిపాటాలేకుండా గడిపిన మా స్నేహితుడు ఒకడు నాకు ఫోను చేసాడు... మామా! పార్టీ చేసుకొందాము అని... ఇంకొక సారి హుర్రే!!! అని ఎగిరి గంతేసాను. ఈసారి రెట్టింపు ఆనందం. ఎందుకో తెలుసా..??మొదటికారణం: నాలాగా నాలుగేళ్ళు పనిపాటాలేకుండా ఉన్న ఇంకొకడు దొరికాడని; రెండు: నాలుగేళ్ళు పనిపాటాలేకున్నా పార్టీ వచ్చినందుకు.
నాలుగు చుక్కలు గొంతులో దిగేటప్పటికి ఆత్మశోధన మొదలయ్యింది. ఏమీ సాధించలేదా...!!?? లేదా!!!??? సాధించాను... మా బాసుకి కనిపించకుండా ఆంధ్రజ్యొతి, ఈనాడు చదవటం నాకు తెలిసినట్లు మా ఆఫీసులో ఎవ్వరికీ తెలియదు. ఇంకా... యహూ మెసెంజర్, జిమైలు వాడటం వీటన్నిటిలో మనం మేధావులం కదా! హుర్రే!!! చాలా సాధించాం.
రెండో పెగ్గు:మనం ఎక్చెల్, వర్డు వాడినట్లు ఎవ్వరూ వాడలేదు కదా... అందుకేగా మనం టీం లీడు అయ్యింది... మన పక్కనున్నోళ్ళందరూ పనికిరానొళ్ళని మనమేగా మా మానేజరుకి మందుపోసి మరీ చెప్పింది?? హుర్రే!!! చాలా సాధించాం.
మూడో పెగ్గు:ఆఫ్‌షోరులో ఉన్నప్పుడు ఆన్‌సైటు వాళ్ళని, ఆన్‌సైటు ఉన్నప్పుడు ఆఫ్‌షోరులో వాళ్ళని పనికిరాని వాళ్ళగా చూపించతం మనకి తెలిసినంతగా ఇంకెవరికి తెలుసు?? మనకి రేటింగు ఇవ్వని మేనేజర్ ని బండబూతులు తిట్టటం, మనకి తెలిసినట్లుగా ఇంకెవరికి తెలుసు? హుర్రే!!! చాలా సాధించాం.
Friday, March 14, 2008
Sunday, March 9, 2008
Monday, February 25, 2008
భూమి గుండ్రం గా ఉంది
వీడేంటి? "భూమి గుండ్రం గా ఉంది" అని కొత్త నిజం చెప్పినట్లు చెపుతున్నాడు? అనుకొకండి. కొన్ని కొన్ని సంఘటనలు మనకి పైన చెప్పిన నిజాన్ని మరలా మరలా గుర్తు చేస్తుంటాయి.
మొన్న గౌరవ పార్లమెంటు సభ్యుడైన ఉండవెల్లి, మన రాజ్యాంగాన్ని, స్వర్గీయ డా!అంబేత్కర్ గారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినట్లు పేపర్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానిని టిడిపి ప్రొద్బలం తో అంధ్రజ్యోతి, ఈనాడు రాజకీయం చేసాయని కాంగ్రెస్స్ వాళ్ళు ఆరోపించారు.
నిన్న తల్లి తెలంగాణా అద్యక్షురాలు విజయశాంతి టిడిపి మీద చంద్రబాబు మీద వికలాంగుల సంక్షేమం విషయం లో ఆరోపణలు చేసిన సంగతి కూడా తెలిసిందే. దానిని కాంగ్రెస్స్, వైయెస్ ప్రొద్బలం తో విజయశాంతి రాజకీయం చేసిందని టిడిపి వాళ్ళు ఆరోపించారు.
కాంగ్రెస్స్ మీద ఆరోపణలు వస్తే టిడిపి ప్రొద్బలం, టిడిపి మీద ఆరోపణలు వస్తే కాంగ్రెస్స్ ప్రొద్బలం. ఇదేదో "భూమి గుండ్రం గా ఉంది" ని గుర్తుకు తెస్తుంది కదా!!
Tuesday, February 12, 2008
మన తెలుగు బ్లాగుల గురించి ఈనాడు లో
Sunday, February 10, 2008
కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్
ఈ పద్యం విన్నారా...? ఎప్పుడైనా..??
"గంజాయి తాగి తురకల
సంజాతుల గూడి కల్లు చవిగొన్నావా
లంజల కొడకా ! యెక్కడ
కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్ | కం | "
పోనీ ఈ పద్యం...????
"రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు గొల్వ పాల్పడి రకటా
సంజయా ! యేమని చెప్పుదు ?
కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్ | కం |"
ఇవి తెనాలి రామకృష్ణ కవి కధలలో చెప్పెవారు నా చిన్నప్పుడు.
ఒకసారి రామకృష్ణ కవి గారిని ఏవిధంగానూ ఎదుర్కోలేక , చివరికి కాపలా వాళ్ళ చేత అవమానింప చెయ్యాలని అనుకొన్నారు మిగతా కవులు. మిగతాకవులిచ్చే లంచాలకి ఆశపడి కాపలా వాళ్ళు కవులిచ్హే సమస్యని రామకృష్ణ కవి గారి ముందు ఉంచటానికి సిద్దపడ్డారు. సమస్య ఎమిటంటే "కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్".(అంటే ఏనుగుల గుంపు వెళ్ళి దొమ గొంతులో ఇరుక్కొన్నదని అర్థం). దీనిని కవి గారి ముందు సమస్యా పూరణం కోసం ఉంచారు భటులు. రామకృష్ణ కవి గారికి విషయం అర్థమయ్యింది. అందుకని మొదటి పద్యాన్ని వదిలారు....
దాని అర్థం భటులకి బోధపడెలోగా కవిగారు భువనవిజయం వైపు అడుగులు వేసారు. రాయల వారికి ఈ విషయం తెలిసింది. సరే రామకృష్ణులవారి చతురత ఏమిటో చూద్దామని మరల అదే సమస్యనిచ్చారు రాయలవారు. ఈ సారి అడిగింది రాయలవారు, మరలా అదే సమాధానం చెపితే దండన తప్పదని మురిసిపొతున్నారు మిగతా కవులు. కాని రామకృష్ణులవారి చతురత తెలిసిందె కదా! సభలొ ఈ రెండో పద్యం వదిలారు. ఎవ్వరికీ నోటమాట రాలెదు. రాయలవారు స్వయంగా కవిగారిని ఆలింగనం చేసుకొని, రామకృష్ణా "నీ కత్తికి రెండువైపులా పదునే" అని ప్రసంసించారట.
మొదటి పద్య భావం అర్థమయి ఉంటుంది. రెండవపద్య భావం: " (మహాభారతం లోని పాండవులని ఏనుగులతో పొల్చారు). మహా బలవంతులు అయిన పాండవులు, కౌరవుల జూదం లో ఒడిపొయి, ఒక చిన్న సామంత రాజయిన విరాట రాజు (విరాట రాజుని దొమతో పోల్చారు) కొలువు లో అజ్ఞాతవాస సమయం లో పనిచెయ్యవలసి వచ్హింది. ఓ రాజా ఇది ఏనుగుల గుంపు వెళ్ళి దోమ గొంతులో కూర్చొవటం కాక మరేమిటి? "/
Saturday, February 9, 2008
నువ్వు నువ్వు నువ్వే
నువ్వు నువ్వు నువ్వే... నువ్వు
నువ్వు నువ్వు నువ్వు...
నువ్వు నువ్వు నువ్వే... నువ్వు
నువ్వు నువ్వు నువ్వు...
నాలోనే నువ్వు
నాతోనే నువ్వు
నాచుట్టూ నువ్వు
నేనంతా నువ్వు
నా పెదవి పైనా నువ్వు
నా మెడ వంపున నువ్వు
నా గుండె మీదా నువ్వు
వొళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వు, మొగ్గల్లే నువ్వు, ముద్దేసే నువ్వు...
నిద్దర్లో నువ్వు, పొద్దుల్లో నువ్వు, ప్రతి నిమిషం నువ్వూ...
నువ్వు నువ్వు నువ్వే... నువ్వు
నువ్వు నువ్వు నువ్వు...
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు
ఎంటి వీడికేమీ పిచ్చి పట్టలేదుకదా అనుకొకండి. ఎమీ లేదండీ... నిన్న ఎదో ఊసుబోని కబుర్లలో... ఈ పాట ప్రస్థావనకు వచ్చింది. మన సిరివెన్నెల ఎంత బాగా రాసాడొ కదా! అనుకొన్నాం. నేను రచించక పోయినా.. ఒక్క సారి తెలుగులొ వ్రాస్తే ఎలా ఉంటుందొ అని ప్రయత్నించాను. అదీ సంగతి.
Friday, February 8, 2008
చర్చిల్ - ఫూల్సు
Thursday, December 13, 2007
అష్టావధానం
ఉదాహరణకి దోసె, పూరీ, వడ,సాంబారు అనే నాలుగు పదాలని నాల్గు పాదాలలో ఇముడ్చుతూ ఆ శబ్దంలోనిఅర్థంలో చెప్ప కూడదనేది నియమము
ఈ పద్యాన్ని చూడండి
వర్ణన: శివ కల్యాణం। శివుడికి దోసె, పూరీ ,వడ, సాంబారు అంటకట్టాలి।
పద్యం:
జడలో దోసెడు కొండమల్లికలతో సౌరభ్యముల్ చిమ్మి వ
చ్చెడు పూరీతిగ హాస చద్రికలతో సింధూరసీమంతియై
వడకున్ గుబ్బలి ముద్దుపట్టినుదుటన్ వాసంతియై నిలుచు ఆ
పడతిన్ పత్నిగ స్వీకరించితివి సాంబారుద్రా! సర్వేశ్వరా!!
ఈ పద్యంలో మొదటి పదంలోని జడలో దోసెడు అంటూ దోసె అనే శబ్దాన్ని దోసెడు నిండుగా అని వేరే అర్థంలో ఉపయోగించారు।రెండవ పాదంలో పూరీతిగ అనే చోటా పూరీ అనే శబ్దాన్ని పూవు వలే అనే వేరే అర్థంలో ఉపయోగించారు। అలాగే మూడవ పాదంలో వడ అనే శబ్దాన్ని వడకిపోవడం అనే అర్థంలో ఉపయోగించారు.
ఇక నాల్గవ పాదంలో చివరి భాగంలో సాంబా రుద్రా అంటూ సాంబారు అనేశబ్దాన్ని ఉపయోగించారు. ఇలాగ తెలుగు భాషకు మాత్రమే ఉన్న సౌలభ్యం.
మరొక దత్తపదిని చూద్దాం-
బీరు,బ్రాంది, విస్కీ,రమ్ము అనే నాలుగు పదాలూ నాలుగు పాదాల్లో వాడుతూ పద్యం ఆ శబ్దార్థాన్ని వాడకుండా చెప్పిన పధ్యం చూద్దం।
అతివా గుండెలబీరువా తెరచి నీకర్పించుకుంటిన్ గదా
అతుల ప్రేమ మనోజ్ఞత్వము ఇక నబ్రాందీ కృత శ్యా
మతాన్వితమైన కటిసీమవెల్గు హృదయావిష్కీర్ణ సంకార్యమై
రతివో! రంభవో! రాధికారమణివో! రావే జగజ్జిన్నుతిన్।
ఈ పద్యంలో మొదటి పాదంలో గుండెలబీరువా అని "బీరు" అబ్రాందీకృత అని "బ్రాందీ" అనే శబ్దాన్ని హృదయావిష్కీర్ణ అనే చోట "విస్కీ" రంభవో అనే చోట "రం"అనే శబ్దాలు చెప్పడమేకాక జగజ్జిన్నితిన్ అనే చోట " జిన్" అనే శబ్దాన్ని కూడా చెప్పడం విశేషం । ఇది కవి చమత్కారానికి వన్నె తెస్తుంది.
ఒక్కకప్పుడు చాలా బాధగా ఉన్నవారిని ఊరడించడానికి మంచి ఉపాయం సహిత్యం. కొన్ని పద్యాలు వింటే ఎంత బాధనైనా మరచిపోతాం. ఉదాహరణకి
తెలుగులో గాడిద అని గాడిదకొడకా అని పిల్లల్ని తిడుతూ ఉంటాం. అప్పుడు ఒక గాడిద విని ఇలా అనుకొంటోంది-
ఆడిన మాటను తప్పిన
గాడిదకొడుకంచు తిట్టగా విని
వీడా నాకొక కొడుకని
గాడిద ఏడ్చెన్ గదన్నఘన సంపన్నా!!
Thursday, November 1, 2007
బ్రతుకు అంటె నిత్య ఘర్షణ...!!
"నొప్పిలేని నిమిషమేది...జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా...?
నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు, బ్రతుకు అంటె నిత్య ఘర్షణ...!!"
నిజమేకదా అనిపించింది। ఇంత చిన్న సత్యాన్ని కూడా మరిచి పోతాం కాబట్టే కష్టమొచ్హిన ప్రతిసారీ క్రుంగిపొతాం... సుఖం ఉన్న ప్రతిసారీ ఎవ్వరినీ లెక్క చెయ్యం। కానీ ఇలా చెప్పినంత సులభం కాదులేండి ఆచరణ।
నేను చెప్పదలచుకున్నదేమిటంటె... కష్టం,సుఖం కూడా మన జీవనగమనంలో సహజమైన పరిణామాలేనని అర్థం చేసుకొంటే వాటిని అధికమించేటందుకు కావలసిన శక్తి, ధైర్యం మనకు అలవడుతాయి...
ఈ సోదిని ఇంకొక్క చరణం తో ముగిస్తాను।
"బాధ అనే మాటకర్థం॥ నిన్ను నువ్వే గెలుచు యుద్ధం॥!
యుద్ధం మొదలెట్టందే, ప్రశ్నిస్తూ కూర్చుంటే అపజయమే ఎదురవుతుంది...!!"
అందరికీ ఆంధ్రావతరణ శుభాకాంక్షలు.
Sunday, October 21, 2007
కవిత్వం అంటే
కవిత్వం అంటే స్వచ్చందంగా జీవితాన్ని ఆరుబయట వదిలేయడం
జారుకుంటున్న మాయలేడి వెంట పరిగెత్తడం
కవిత్వం అంటే సకల బంధనాల్నీ వదిలించుకోవడం
పవనాల్లో పత్రంలా ఎగరడం
కవిత్వం అంటే భయాన్ని వదలడం - గొంతెత్తి నిర్భయంగా పాడడం
కవిత్వం అంటే మొహమాటాల్ని వదలి నిన్ను నువ్వు వినడం
కవిత్వం అంటే జన సమ్మర్దంలో నిద్రపోయే నీ అస్తిత్వాన్ని తట్టిలేపడం,కవిత్వమంటే ఆనందించడం
కవిత్వమంటే నిర్భయత్వం, కవిత్వమంటే నిర్వికారత్వం
కవిత్వమంటే స్వాతంత్ర్యం
కవిత్వమంటే కురిసే వెన్నెల్లో పరుగెత్తడం - వెన్నెల్లో హల్లీసకం ఆడడం
కవిత్వమంటే ఎండల్లో సాగరతీరంలో కొండవూట నీళ్లు తాగడం
కలలు కనడం కవిత్వం,
కరువుతీరా ఏడవడం కవిత్వం,
కడుపు చెక్కలయ్యేట్టునవ్వడం కవిత్వం,
నీర్హేతుకమైన నీ సందేహాల్ని వదలి,
నిష్ర్పయోజనమైన నీ అనుమానాల్ని విడిచి, యధాతథంగా సంపూర్ణంగా బతికేయడం కవిత్వం,
నీ తడబాటు పలువల్ని వదలిపెట్టి జీవితసరసులో ఈదడం కవిత్వం,
జ్వాలా కమలాన్ని అందుకోవడం కవిత్వం
Tuesday, October 9, 2007
నేను - జమజచ్చ - షైలా భాను
Monday, October 8, 2007
బలి
మగ చెవి - ఆడ నాలుక
Friday, October 5, 2007
చీ!! ఈ వెధవ బ్రతుకు!!!!!!!!!!!!
కాలెజీ లో ఉన్నన్నాళ్ళూ చదువులు ఎప్పుడు అయిపొతాయో, పరీక్షల నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో, ఉద్యోగం లో చేరి డబ్బులు ఎప్పుడు సంపాదిస్తామో అని… ఉద్యొగవేటలో నానా తిప్పలూ పడి, నానా గడ్డీ తిని, చివరకు ఎలాగో ఉద్యోగం సంపాయిస్తాం।
ఉద్యోగం లో జాయిన్ అవుతాం
మొదటి నెల: పని తక్కువ – ఎంజాయ్ ఎక్కువ – ఆల్ హాపీస్
రెండో నెల: పని – ఎంజాయ్ – ఓకే
మూడో నెల: పని – పని – నో ఎంజాయ్ – సమస్యలు మొదలు ...
అప్పటికి ఆఫీసు రాజకీయాలు తెలుస్తాయి.
పక్క టీము మేనేజర్ మంచోడు అవుతాడు.
పక్క టీము లో అమ్మాయిలు\అబ్బాయిలు బాగుంటారు.
పక్క టీము లో జీతాలు తొందరగా పెరుగుతాయి
పక్క టీము లో అస్సలు పనే ఉండదు.
మనకి మాత్రం రోజూ దొబ్బించుకోవటమే…
ఒక్కొక క్లయింటు ఎమో పిచ్హి నా Requirements ఇస్తాడు. అవి పని చెయ్యవని తెలిసీ అలానే చెయ్యాలి.
వాడిని అమ్మనా బూతులూ తిట్టి వెళ్ళిపొదాం అనిపిస్తుంది.
కాని ఆ ఆఫీసులో నెట్ , కాఫీ ఫ్రీ అని గుర్తుకొస్తుంది.
మనలాంటి వాళ్ళ తో ఒక బాచ్ తయ్యారవుతుంది. వారానికి ఒకసారి మందు కొట్టి మన PLని TLని తిట్టటం మొదలు పెడుతాం. అలా ఆరునెలలు గడిచిపోతాయి.
ఇక లూపు లో పెట్టి కొడితే రెండు సంవత్సరాలు గడచి పోతాయి. కళ్ళ క్రింద నల్ల చారలు, వలయాలు… వళ్ళు నొప్పులు.. మెడ నొప్పులు… వేళ్ళు వంకర్లు… వగైరా…
అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు వీళ్ళందరినీ చుట్టపు చూపుగా కలవాల్సొస్తుంది। వీళ్ళల్లొ ఎవరైనా మనలాంటి ఉద్యోగం లో ఉంటే మన పరిస్థితి అర్థమవుతుంది. లేకపోతే… ఫోను చేసిన ప్రతిసారీ సంజాయిషీ చెప్పుకోవాలి….
వచ్చిన జీతాన్నంతా క్రెడిట్ కార్డుల బిల్లులలకి, తాగటానికి తగలేస్తాం. ఈ జీవితం అలవాటయిపొతుంది. అలా జీవితం ప్రశాంతంగా గడచి పొతుడగా ఒకరోజు మన కొలీగు తన పెళ్ళి అని పిలుస్తాడు. మనకి కూడా పెళ్ళి చేసుకోవాలనే వెధవ ఆలోచన ఒకటి పుడుతుంది. మన S/W లో అమ్మాయిలంతా పెళ్ళి అయినోళ్ళు, ఆల్రడీ కమిట్ అయినోళ్ళు లెకపొటె ఉత్తర భారత దేశపు వాళ్ళు అయి ఉంటారు. వందలో తొంభయైదు మంది పోగా… మిగిలిన అయిదుగురి లో నలుగురు అక్క అంటే నే బెటర్ అనే లాగా ఉంటారు.
ఇక మిగిలింది ఒక్కరు.
ఆ ఒక్క అమ్మాయికోసం, టీం అంతా ఊరకుక్కల్లాగా కొట్టేసుకొంటాం.
ఆ అమ్మాయి మాత్రం, ఎవ్వరి తోనూ కమిట్ కాకుండా, అందరితొ పబ్బం గడిపేస్తూ ఉంటుంది.
ఒక మంచి రోజు చూసి, నాకు మా బావ తో పెళ్ళి అని పెళ్ళి పత్రికలు పంచుతుండి.
మనమదరం, ఆ అమ్మాయి మంచిది కాదు అని డెసైడు చేయటానికి మందు కొడతాం.
ఇంకొక అమ్మాయి కోసం ప్రయత్నాలు మొదలు.
ఉద్యోగం లో reviews వస్తాయి. “నువ్వు ఎక్సలెంట్..
నువ్వు లేనిదే మా కంపెనీ లేదు… కత్తి కమాల్…“లాంటివెన్నో చెపుతారు.
చివరలో… “కానీ…” అని ఒక్క మాటతో గాలి తీస్తారు…
నీ జీతం లో ఒక శనక్కాయ పెంచాం ఫొ! అంతారు.
మనం సణుక్కొటూనె…
అదే శనక్కాయల మీద బ్రతికేస్తుంటాం….
జీవితం అంతా దూరదర్సన్ ప్రసారాలలానే ఉంటుందా…??
వేరే ప్రొగ్రాములు ఉండవా…?
చీ!! ఈ వెధవ బ్రతుకు!!!!!!!!!!!!
Wednesday, October 3, 2007
చేతగాని 'మనం'
ఇంతకీ ఈ దేశ ప్రజలు గాజులు తొడిగించుకొని కూర్చున్నారు! ముఖ్యంగా హిందువులు! డేనిష్ పత్రికలొ తమ దేవుడిని వెక్కిరిస్తే - ఇండియా కార్లని తగులబెట్టే ఈ ప్రభుద్దులు; తన తల్లి ఒంటికి మాత్రం నిండుగా బట్టలు తొడిగి, నగ్నంగా ఉన్న సీతని నగ్నంగా ఉన్న హనుమంతుని తొడమీద కూర్చొబెట్టినా, మన పార్వతిని, మన సరస్వతిని ఎలా చిత్రీకరించినా మనకు మాత్రం సిగ్గు ఎగ్గు ఉండదు! పైగా అలాంటి గొ...ప్ప చిత్రకారులకి పద్మభూషణ్ ఇచ్చి చంకలు గుద్దుకున్న వ్య(అ)వస్త మనది!
'హజ్' వెళ్ళటానికి సహాయం చేస్తున్నారు కదా! మేము కూడా కాశి వెళ్ళొస్తాం సహాయం చెయ్యండి అని అడగలేని దద్దమ్మలం మనం!
నేను విశ్వహిందూ పరిషత్ సభ్యుడిని కాదు. గంటకొకసారి రంగుమార్చి మతం తో ఆడుకొనే రాజకీయ నాయకుడిని కాదు. మత చాధసం పేరిట పొరుగు దేశాల ఎంగిలి బుధ్ధుల మేధావి పార్టీల మనిషిని కాదు. ఏ పార్టీకి తాకట్టు పెట్టటానికి సిధ్ధంగా లేని ఆత్మాభిమానం ఉన్న హిందువుని.
గల్లీ బుద్దులున్న ఢిల్లీ పెద్దలారా! పార్లమెంటు మీద దాడి చేసిన వాడిని ఉరి తీయమని కోర్టు ఆదేశించినా, అలా చెయ్యలేని మీ చేతగాని తనాన్ని మీదగ్గరే ఉంచుకోండి. ఖత్రొచీలను మన వ్యవస్త చేతులు కట్టి కాపాడుకోండి. గడ్డితినే నాయకులని, హత్యల వీరులని అందలాలు ఎక్కించుకోండి. మా రాముడిని మాత్రం మాకు వదిలెయ్యండి.
హిందువులారా! మనం అన్యమత సోదరులాగా బస్సులమీద రాళ్ళు వెయ్యొద్దు. రాళ్ళు రువ్వి పక్కవాడి ఇళ్ళు నాశనం చెయ్యొద్దు. మన చేతులనిండా రకరకాల రంగుల గాజులున్నాయి. కనీసం ఇప్పుడైనా మన రాముడి కొసం ఒక్కొక్క గాజు తీసి పక్కన పెట్టండి. లెకపొటే, మనం ఇలాగే ఉంటాం. ముక్కోటి దేవతలలో ఏ ఒక్కరూ మిగలరు.
- గొల్లపూడి గారి కాలం "ఒక గర్జన" ఆధారంగా!
Tuesday, October 2, 2007
వర్షం
చిరుగాలుల చల్లని స్పర్శకు...
మబ్బు కన్నెలు పులకించి
మేను మైమరచి
ఆనంద భాష్ప పుష్పాలు
వర్షిస్తున్నాయి.
Wednesday, September 26, 2007
వన్నెల స్వప్నాలు
కిరణాల కెరటాలపై
విహరిద్దాం రా!
వెన్నెల రేయిలో
వన్నెల స్వప్నాలు
ఆవిష్కరిద్దాం రా!
Thursday, September 20, 2007
మహా ప్రస్థానం
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
పోదాం!పోదాం!పై పైకి!
కదం తొక్కుతూ,
పదం పాడుతూ,
హ్రుదయాంతరాళం గర్జిస్తూ
పదండి పోదాం
వినపడలేదా మరోప్రపంచపు జలపాతం? -------
Sunday, September 16, 2007
పోతన గారి ఒక గొప్ప పద్యం
ముక్కు తిమ్మన గారి అద్భుతమైన romantic ముక్కు పద్యం.
నాన సూన వితాన వాసనలనానందించు
సారంగమేలా తన్నొల్లదటంచు
గంధఫలి బల్కానల్ తపంబొంది యోశానాసాకృతి బూనె సర్వసుమన
సౌరభ్య సంవాసియైబూనెం బ్రేంఖణ
మాలికా మధుకరీపుంజంబులిర్వంకలన్
అన్ని పుష్పాలమీదా వాలే తుమ్మెద తనమీద ఎందుకు వాలదు అని అలిగిన సంపెంగపూవు భయంకరమైన అడవులలొకి పోయి తపస్సు చేసి దేవుడి దగ్గ్గిర వరం తెచ్చుకుందిట. అది ఏమిటంతే ఇతని ప్రియురాలి ముక్కు గా పునర్జన్మించి అన్ని పూవుల వాసనలని ఆనదిస్తూ రెందు తుమ్మెదలని ఇరువైపులా మాలగా ధరించిందిట.
ఆహా, అద్భుతమైన పద్యం. మహా ప్రసాదం.
Sunday, September 2, 2007
మరువ లేకున్నా...
నీ చూపు తాకిన మరుక్షణాన
ఆ విషయాన్ని మళ్లీ మరచిపోతున్నా
మాటల్లో పడకూడదనుకుంటున్నా కానీ..
నీ పెదాలు అలా ఇలా మెదిలే సమయాన
దాన్ని అలాగే పట్టించుకోక వదిలేస్తున్నా
నీ వయ్యారి నడుము ఊయలూగితే
కిలకిలమని చెలరేగిపోతున్నాయి
నాలోని మధుర భావాలునీ
గజ్జెల సవ్వడి విన్పించగానే
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి
నా గుండెల్లో అలజడులు ప్రియా!
నాపై ఎందుకింత కోపం
ఇకనైనా వీటిని చాలించవా
నా బాటన నన్ను సాగనియ్యవా
ఎంతెంత అందం...
ప్రపంచమంతా కలలోకి వచ్చింది
ఆ కలలో...
లాలించే అమ్మ
ప్రేమను పంచే నాన్న
జ్ఞానంతో పెంచే గురువు
నాతో ఆడుకునే అక్కయ్య... అన్నయ్య
నన్ను వదలని తమ్ముడు, చెల్లాయి
ఎప్పుడూ ఎదురు చూసే స్నేహితులుఅంతేనా...
సహనానికి స్త్రీ మూర్తి
నిర్మలమైన పాపడి నవ్వు
లావణ్యమూర్తులు తరుల్లతలు
ఇంకా...ప్రశాంత గగనందానికి అలంకారంగా తారామణులు
మాలిన్యాన్ని కడిగేసే గంగకారుణ్యాన్ని కురిపించే దైవం
అన్నీ ప్రేమకు ప్రతిరూపాలే
ఆప్యాయతకు మారుపేర్లు
అనురాగానికి దర్పణాలు
అందాలకు అనుబంధాలు
మెలకువ వచ్చింది
అప్పుడు అర్థమైంది
అందమైనవన్నీ నాకిచ్చి..
ఆనందాలను పంచిన
ఆ సృష్టికర్తది ఎంతెంత అందం!
Saturday, September 1, 2007
నాకై నేను ఉదయించనీ
కాసేపు నన్ను నేనైనా చూసుకోనీ
నా ముఖాన్ని గుర్తు పట్టనీ
నా గొంతును కాసేపు నన్నుగా విననీ
నన్ను నేనైనా కాస్సేపు అనుభవించనీ
నాకైనేను అర్థం కానీ
నేనొక ముఖం కోసం వెతుకుతున్నాను
కానీ ఏం లాభం!
ఒక నమ్మకమైన అద్దం దొరకడం లేదు
ప్రతి దర్పణమూ దాన్ని తయారు చేసిన వాడి ముఖమే చూపిస్తోంది
నన్ను నన్నుగా చూపించే అద్దం లభించనీ!
అనుభవానికి దాని సత్యం అనర్థం
ఆ సత్యాన్ని నన్ను నేనుగా అనుభవించనీ!
ఈ నిశ్శబ్ధ నిరామయ నిశీధిలో నన్ను ఇలా ఉండనీ
సంపూర్ణమైన ఈ నిశీధ నిశ్శబ్ధ సంగీతం నన్ను ముంచి వేయనీ
ఆ ఉదయాన్ని నేనే జయించనీ!
ఆదర్శం
Monday, August 27, 2007
ఆనందం... బాధ...దేహం...మనసు
Sunday, August 5, 2007
ఫలానా...
Saturday, August 4, 2007
తెలుగు
తెలుగు రేడ నేను తెలుగొకండ
యెల్లవారు వినగ యెరుగవే బాసాడి
దేశ భాష లందు తెలుగు లెస్స"- శ్రీ కృష్ణదేవరాయలు
"తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది!
తెలంగాణ నాది, నెల్లూరు నాది, సర్కారు నాది, రాయలసీమ నాది!
అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదే రా! " - సి.నా.రె
Maroo Kavita
తరించి తడిసి నేను..
నీ నవ్వుల వెన్నెలలో అలలో
విరిసి మురిసి నేను..
నీ మనసు ముంగిలిలో
చలిలోనిలిచి వేచి నేనూ…
* * * * *
నా వల్ల కాదు
నీ జ్ఞాపకం చెరపటం నా వల్ల కాదు
నిను మరవడానికి చేసే ప్రతి ప్రయత్నం లో
మరో జ్ఞాపకమైపొతున్నావు
వెన్నెల వెలుగులో వాన చినుకుల్లో సంద్రపు అలల్లో....
కలసి పంచుకున్న క్షణాలే కనిపిస్తున్నాయి
దూరమవుతున్నాననుకుంటూ...
మరింత దగ్గరైపోతున్నాను.
జ్ఞాపకాలు చెరిపేస్తున్నాననుకుంటూ..
ప్రతి ఆలోచనలో నిను పొందుపరిచేస్తున్నాను.
ఇప్పటికి అర్దమయింది...
నేను వదులుకుందామనుకుంటుంది
నీ జ్ఞాపకాన్నే గానీనిన్ను కాదు అని...
Sunday, July 29, 2007
Naku nnachhina Padyam.
ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపలనందు లీనమై
ఎవ్వని యన్దుడిన్దు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడు
అనాది మధ్యయలుందెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు
వానినాత్మభౌన్ ఈశ్వరునే శరణంబు వేడెదన్!!!!
Saturday, July 7, 2007
సినిమాలు - సెటైర్లు
Thursday, June 21, 2007
ఎన్.టి.ఆర్
మూర్తీభవించిన భోజరాజు, కృష్ణదేవ రాజుని ఠీవి రెంటిని కలబోసి
కంటికింపుగ నీవు నటియుంచినావన్న నటరత్న రూపాన
నిమ్మకూరున బుట్టి, తమ్ములందరిని చేర్చి
అందచందాలతో ఆనందమును బంచి
ఉద్దరింపగ ప్రజల ఉద్యమము చేపట్టి
తెలుగు కీర్తి నంత ఎలుగేత్తి చాటగ
వరప్రసాదివై వచ్చినావా అన్న
కళల కాణాచివి,కళా సృష్టివి నీవు
ఒక్కక్క పాత్రను ఓప్పింప
జీవమును పోసి పోషించితివి
పొందెనా పాత్రలు నీవలన నిజమైన
సజీవ రూపములు
ఎంత వైవిధ్యము!ఎంత నటనా పటిమ!
ఆన్న ఉన్నతుడన్న మన్ననలను పోందగ
నామ రూపములందు
రాముడవు,కృష్ణుడవు
దానమిచ్చుటయందుదాన
కర్ణుడవు సుయోధనుడవు
నీవుచూడ అభిమానమున
ప్రతినలో భీష్ముని ప్రతిష్ణ ను బెంచి
భీముడర్జునుడను బృహన్నలను దలచి
పులకించి పోయదము
పుణ్యరాముని గాంచి
శ్రీ నాధ వేషాన సిరులు కురిసినవన్న
రావళుండాదిగారాజులెల్లరు నీదుఠీవి గని,
ఠారుకొని, పాఠాలు నేర్పమనిఅడుగ
వత్తురేమో బ్రతికి వచ్చి మరల
Friday, June 15, 2007
VISA అపాఇంట్మెంట్ తెలుగు లో
Friday, May 25, 2007
ఉగాది
వేలాడే మామిడి తోరణం
కుహు కుహు అని కూసే కోయిలలు
కొత్త వత్సరానికి పలికే స్వాగతాలు
గతం విడిచిన అనుభవాలు
జ్ఞాపకం ఉంచుకొనే విషయాలు
కొత్తదనాన్ని ఆహ్వానించే వే ళచేసుకునే బాసలు
చెప్పుకునే తీపి కబుర్లు
ఉగాది పచ్చడి రుచిలో సర్వ అనుభూతులు
వెరసి కలిసే వే ళ
స ర్వజిత్ సంవత్సర శుభాకాంక్షలు
Thursday, May 24, 2007
ఒక కవిత
హే కృష్ణా ఒక్కసారి ఈ కలియుగంలో రావయ్యా! నీవు పదహారేళ్ళ ప్రాయంలోనే కంసుని చంపావంట
బిన్ లాడెన్ ను కనీసం తాకి చూడు.
నీవు అర్జునునికి గీతాసారాన్ని వినిపించావంట
మా ప్రాజెక్ట్ మేనేజర్ తో ఒక్కసారి మాట్లాడి చూడు.
నీవు అర్జునుని రథసారధివై పాండవులను గెలిపించావంట.
మన భారత క్రికెట్ జట్టుకు కోచ్ వై ప్రపంచ కప్పును గెలిపించి చూడు.
నీవు ద్రౌపదికి బోలెడు చీరలిచ్చి తనను రక్షించావంట
మల్లికా షెరావత్ కు కనీసం ఒక్క ఓణీయైనా వేయించి చూడు.
నీవు గోకులంలో 16,000 గోపికలతో సరసాలాడావంట.
మా ఆఫీసులో ఒక్క అమ్మాయికైనా లైనేసి చూడు.
హే కృష్ణా ఒక్కసారి ఈ కలియుగంలో రావయ్యా
రావయ్యా!





