Wednesday, September 26, 2007

వన్నెల స్వప్నాలు

వెలుగుల వాహినిలో
కిరణాల కెరటాలపై
విహరిద్దాం రా!
వెన్నెల రేయిలో
వన్నెల స్వప్నాలు
ఆవిష్కరిద్దాం రా!

Thursday, September 20, 2007

మహా ప్రస్థానం

మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
పోదాం!పోదాం!పై పైకి!
కదం తొక్కుతూ,
పదం పాడుతూ,
హ్రుదయాంతరాళం గర్జిస్తూ
పదండి పోదాం
వినపడలేదా మరోప్రపంచపు జలపాతం? -------

Sunday, September 16, 2007

పోతన గారి ఒక గొప్ప పద్యం

పోతన గారి శైలి భిన్నమైనది. మిగతా కవుల్లా కాకుందా ఆయన మమూలు పదాలతొ పదవిన్యాసం చెస్తారు. మహాభాగవతం లోని గజేంద్రమొక్షం లొ ఈ పద్యాన్ని చూడండి. అతి సాధారణ పదాలతొ ఎలా విన్యాసాలు చెసారొ!
కరి అంటే ఏనుగు, మకరి అంటే మొసలి. ఇంక కవిగారికి అంతకంటే ఏమి కవాలి ? చిన్ని మాటలతో అద్భుతమైన పద్యాన్ని సౄష్టించారు. చదివి ఆనందించడి.

ముక్కు తిమ్మన గారి అద్భుతమైన romantic ముక్కు పద్యం.

మనము హిందీ poetry చదివి, లెకపొతే హిందీ పాటలు వినీ, ఆ చచ్చు సాహిత్యాన్ని "ఆహా ఓహొ" అని మెచ్చుకొంటాము. కాని మన తెలుగులో ముక్కు తిమ్మన గారు తన ప్రియురాలి ముక్కు పైన ఎంత అద్భుతమైన కవిత రాశారొ మనలో చాలామందికి తెలియదు. ఇది నిస్సందేహంగా ప్రపంచం లొ top 10 పద్యాల్లో ఒకటిగా నిలుస్తుంది. క్రింది పద్యాన్ని చదవండి. అర్ధం నేను వివరిస్తాను.

నాన సూన వితాన వాసనలనానందించు
సారంగమేలా తన్నొల్లదటంచు
గంధఫలి బల్కానల్ తపంబొంది యోశానాసాకృతి బూనె సర్వసుమన
సౌరభ్య సంవాసియైబూనెం బ్రేంఖణ
మాలికా మధుకరీపుంజంబులిర్వంకలన్


అన్ని పుష్పాలమీదా వాలే తుమ్మెద తనమీద ఎందుకు వాలదు అని అలిగిన సంపెంగపూవు భయంకరమైన అడవులలొకి పోయి తపస్సు చేసి దేవుడి దగ్గ్గిర వరం తెచ్చుకుందిట. అది ఏమిటంతే ఇతని ప్రియురాలి ముక్కు గా పునర్జన్మించి అన్ని పూవుల వాసనలని ఆనదిస్తూ రెందు తుమ్మెదలని ఇరువైపులా మాలగా ధరించిందిట.

ఆహా, అద్భుతమైన పద్యం. మహా ప్రసాదం.

Sunday, September 2, 2007

మరువ లేకున్నా...

మరచిపోవాలనుకుంటున్నా కానీ...
నీ చూపు తాకిన మరుక్షణాన
ఆ విషయాన్ని మళ్లీ మరచిపోతున్నా

మాటల్లో పడకూడదనుకుంటున్నా కానీ..
నీ పెదాలు అలా ఇలా మెదిలే సమయాన
దాన్ని అలాగే పట్టించుకోక వదిలేస్తున్నా

నీ వయ్యారి నడుము ఊయలూగితే
కిలకిలమని చెలరేగిపోతున్నాయి

నాలోని మధుర భావాలునీ
గజ్జెల సవ్వడి విన్పించగానే
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి

నా గుండెల్లో అలజడులు ప్రియా!
నాపై ఎందుకింత కోపం
ఇకనైనా వీటిని చాలించవా
నా బాటన నన్ను సాగనియ్యవా

ఎంతెంత అందం...

నిద్రపోతున్నాను
ప్రపంచమంతా కలలోకి వచ్చింది

ఆ కలలో...

లాలించే అమ్మ
ప్రేమను పంచే నాన్న
జ్ఞానంతో పెంచే గురువు

నాతో ఆడుకునే అక్కయ్య... అన్నయ్య
నన్ను వదలని తమ్ముడు, చెల్లాయి
ఎప్పుడూ ఎదురు చూసే స్నేహితులుఅంతేనా...

సహనానికి స్త్రీ మూర్తి
నిర్మలమైన పాపడి నవ్వు
లావణ్యమూర్తులు తరుల్లతలు

ఇంకా...ప్రశాంత గగనందానికి అలంకారంగా తారామణులు
మాలిన్యాన్ని కడిగేసే గంగకారుణ్యాన్ని కురిపించే దైవం
అన్నీ ప్రేమకు ప్రతిరూపాలే
ఆప్యాయతకు మారుపేర్లు
అనురాగానికి దర్పణాలు
అందాలకు అనుబంధాలు

మెలకువ వచ్చింది
అప్పుడు అర్థమైంది
అందమైనవన్నీ నాకిచ్చి..
ఆనందాలను పంచిన
ఆ సృష్టికర్తది ఎంతెంత అందం!

Saturday, September 1, 2007

నాకై నేను ఉదయించనీ

కనీసం నా మనసేమంటుందో తెలుసుకోనీ
కాసేపు నన్ను నేనైనా చూసుకోనీ
నా ముఖాన్ని గుర్తు పట్టనీ
నా గొంతును కాసేపు నన్నుగా విననీ
నన్ను నేనైనా కాస్సేపు అనుభవించనీ
నాకైనేను అర్థం కానీ

నేనొక ముఖం కోసం వెతుకుతున్నాను
కానీ ఏం లాభం!
ఒక నమ్మకమైన అద్దం దొరకడం లేదు
ప్రతి దర్పణమూ దాన్ని తయారు చేసిన వాడి ముఖమే చూపిస్తోంది
నన్ను నన్నుగా చూపించే అద్దం లభించనీ!

అనుభవానికి దాని సత్యం అనర్థం
ఆ సత్యాన్ని నన్ను నేనుగా అనుభవించనీ!
ఈ నిశ్శబ్ధ నిరామయ నిశీధిలో నన్ను ఇలా ఉండనీ
సంపూర్ణమైన ఈ నిశీధ నిశ్శబ్ధ సంగీతం నన్ను ముంచి వేయనీ
ఆ ఉదయాన్ని నేనే జయించనీ!

Intresting....

A hen is only an egg's way of making another egg. How is it?

ఆదర్శం

ఆదర్శాలని బోధించే వాళ్ళు కొంత మంది, ఆదర్శాలని వల్లె వేసేవాళ్ళు కొంతమంది, ఆదర్శాలని ఎలుగెత్తి చాటేవాళ్ళు కొంత మంది,ఆదర్శాల ముసుగులొ స్వలాభం కోసం, సొంత లాభం కోసం పాకులాడేవాళ్ళు కొంత మందీ.... ఎవరు నిజమైన ఆదర్శవంతులు...?? ఇది నాకు అంతులేని ప్రశ్న.. ?? ఎవరైనా తీర్చగలరా....?

Monday, August 27, 2007

రాఖి

ఆనందం... బాధ...దేహం...మనసు

ఆనందం... బాధ... మనసుకు సంబంధించినవి. దేహం...మనసుకి ఆశ్రయం. మనసు బాధ పడితే దేహం వేదన చెందుతుంది. శరీరానికి బాధ కలిగితే...మనసు మూలుగుతుంది. ఆనందం కలిగినా బాధ కలిగినా దేహం స్పందిస్తుంది. దేహానికి ఏమి జరిగినా మనసు కలత చెందుతుంది. ఆశ్రయ ఆశ్రయీభావ సమ్మేళనం ఇది.

Sunday, August 5, 2007

ఫలానా...

"అసలు చెప్పొద్దనే అనుకొన్నాను. కానీ ఫ్రెండువి కదా అని చెపుతున్నాను. ఫలానా వాడు.. నీ గురించి ఫలానా.. అన్నాడు తెలుసా..??" ఎవరో వచ్చి మన చెవిలో ఊదుతారు. మనకి ఆ మాటలు వినగానే టెంపరేచర్ పెరిగిపోతుంది. "హు.. వాడు నన్ను అంతమాటంటాడా..??"అనుకొంటాం. ఇంకా చాలా చాలా అనుకొంటాం మనలో మనమే. అయితే ఫలానా వాడిని సూటిగా అడగం... ఎందుకంటే అప్పటికే మనలో ఆవేశం హిమాలయమంతగా పేరుకుపొతుంది. అసలు ఫలానా వాడు నిజంగా అన్నాడా? ఒకవేళ అనిఉంటే అదే అన్నాడా..? అదే అని ఉంటే ఏ సందర్భం లో అన్నాడు? ఆ మాటకి ముందు వెనక ఏమన్నాడు? అబ్బే.. ఇవన్నీ ఆలొచించే విచక్షణ ఎక్కడుంది? ఒక బాధ తొ కూడిన ఇగో..అహం... "హు.. వాడికి ఎంత చేసాను..? కృతజ్ఞత లేకుండా ఇలా అంటాడా?" మనలో మనమే కుళ్ళిపోతుంటాం... మహా అయితే ఇంకొకరి వద్దకెళ్ళి "చూసావా..? ఫలానా వాడు నన్ను ఫలానా అన్నాడట... ఫలానా వాడు చెప్పాడు" అంటాం. ఇంకొకరు "అవును ఫలానా వాడంతే... ఫలానా అనే కాదు, ఫలానా ఫలానా .... అని కూడా అనే ఉంటాడు.." అంటాడు. నిప్పు మరికొంచెం రాజుకొంటుంది. "అవును నిజమే.. ఫలానా ...ఫలానా.. కూడా అని ఉండొచ్చు... ఫలానా వాడు మొహమాటపడి చెప్పి ఉండడు. ఫలానా ...ఫలానా.. అనే కాక ఫలానా ...ఫలానా.. ఫలానా ...అని కూడా అని ఉంటాడు!!" మన ఆలోచనలకి రెక్కలొస్తాయి. మొట్టమొదట్లొ మనకా కబురు మొసుకొని వచ్చిన వ్యక్తి తనకి తెలిసిన వాళ్ళందరి దగ్గరకి వెళ్ళి మన గురిచి 'ఫలానా వాడు ' అన్న విషయం ఆకాశవాణి లెవల్లొ ప్రచారం చేస్తుంటాడు. ఇంతా చేస్తే... 'ఫలానా' అన్నట్లుగా చెప్పబడిన వ్యక్తి మాత్రం సుఖంగా, సంతొషంగా ఉండొచ్చు. ఎందుకంటే తానా మాటలు అని ఉండకపోవచ్చు. అన్నా వేరే మంచి ఉద్దేశంతోనే అని ఉండొచ్చు..... ఇదండీ విషయం.

Saturday, August 4, 2007

తెలుగు

"తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు రేడ నేను తెలుగొకండ
యెల్లవారు వినగ యెరుగవే బాసాడి

దేశ భాష లందు తెలుగు లెస్స"- శ్రీ కృష్ణదేవరాయలు


"తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది!
తెలంగాణ నాది, నెల్లూరు నాది, సర్కారు నాది, రాయలసీమ నాది!
అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదే రా! " - సి.నా.రె

Maroo Kavita

నీ స్నేహ మధురిలో ఝరిలో
తరించి తడిసి నేను..

నీ నవ్వుల వెన్నెలలో అలలో
విరిసి మురిసి నేను..

నీ మనసు ముంగిలిలో
చలిలోనిలిచి వేచి నేనూ…

* * * * *
నా వల్ల కాదు
నీ జ్ఞాపకం చెరపటం నా వల్ల కాదు
నిను మరవడానికి చేసే ప్రతి ప్రయత్నం లో
మరో జ్ఞాపకమైపొతున్నావు

వెన్నెల వెలుగులో వాన చినుకుల్లో సంద్రపు అలల్లో....
కలసి పంచుకున్న క్షణాలే కనిపిస్తున్నాయి
దూరమవుతున్నాననుకుంటూ...
మరింత దగ్గరైపోతున్నాను.
జ్ఞాపకాలు చెరిపేస్తున్నాననుకుంటూ..
ప్రతి ఆలోచనలో నిను పొందుపరిచేస్తున్నాను.
ఇప్పటికి అర్దమయింది...
నేను వదులుకుందామనుకుంటుంది
నీ జ్ఞాపకాన్నే గానీనిన్ను కాదు అని...

Sunday, July 29, 2007

Naku nnachhina Padyam.


ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపలనందు లీనమై
ఎవ్వని యన్దుడిన్దు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడు
అనాది మధ్యయలుందెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు
వానినాత్మభౌన్ ఈశ్వరునే శరణంబు వేడెదన్!!!!

Saturday, July 7, 2007

సినిమాలు - సెటైర్లు

ఆ మధ్య మన బాలయ్య బాబు సినిమాలన్నీ ఫ్లాప్ అయినప్పుడు, చాలా మంది చాలా సెటైర్లు వేశారు. సెటైర్లు పరవాలెదు. చాలా దారుణంగా, అసహ్యం గా విమర్శించటం ఒకటి. తన సినిమాలు ఫ్లాప్ అయ్యి తను భాధ లో ఉంటే ఇలాంటి సెటైర్లు బాలయ్య అభిమానులకి బాధ కలిగించి ఉండొచ్చు. అలానే మొన్న చిరంజీవి తను కష్టపడి సంపాయిచుకొన్న డబ్బుతొ తనకూతురి పెళ్ళిచేస్తే... ఎవేవో ఆరొపణలు...... విమర్శలు. అవికూడా చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. హీరోలకి లేని ఈ దురద అభిమానులకెందుకో...? ఈలాంటి సెటైర్లు చాలా మంది మీద చాలానే వచ్హాయి. ఇది అంత ఆరోగ్యకరమైన విధానం కాదు. పైగా, అందులొ ఎంతొ కొంత నిజం ఉందనేలా కొన్ని పుకార్లు. ఆ పుకార్ల మీద వాదోపవాదాలు. అంతటితో ఆగక గొడవలు.... సినిమాలంటే అభిమానం ఉండొచ్చు. సినిమా హీరోలంటే అభిమానం ఉండొచ్చు. కానీ వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు కొట్టుకోవటం ఎందుకో నాకు అర్థం కాదు.

Thursday, June 21, 2007

ఎన్.టి.ఆర్

మొన్న ఎవరో ఒక ఎన్.టి.ఆర్ అభిమాని Orkut లో ఈ కవిత చూసా. నాకు చాలా బాగా నచ్చింది. కృష్ణదేవరాయ పాత్ర కనువిందాయె తెలుగు కవితనెంతో ఒలకించినావయ్య భువనవిజయమందు
మూర్తీభవించిన భోజరాజు, కృష్ణదేవ రాజుని ఠీవి రెంటిని కలబోసి

కంటికింపుగ నీవు నటియుంచినావన్న నటరత్న రూపాన

నిమ్మకూరున బుట్టి, తమ్ములందరిని చేర్చి
అందచందాలతో ఆనందమును బంచి
ఉద్దరింపగ ప్రజల ఉద్యమము చేపట్టి
తెలుగు కీర్తి నంత ఎలుగేత్తి చాటగ
వరప్రసాదివై వచ్చినావా అన్న
కళల కాణాచివి,కళా సృష్టివి నీవు
ఒక్కక్క పాత్రను ఓప్పింప
జీవమును పోసి పోషించితివి
పొందెనా పాత్రలు నీవలన నిజమైన
సజీవ రూపములు
ఎంత వైవిధ్యము!ఎంత నటనా పటిమ!
ఆన్న ఉన్నతుడన్న మన్ననలను పోందగ

నామ రూపములందు
రాముడవు,కృష్ణుడవు
దానమిచ్చుటయందుదాన
కర్ణుడవు సుయోధనుడవు
నీవుచూడ అభిమానమున

ప్రతినలో భీష్ముని ప్రతిష్ణ ను బెంచి
భీముడర్జునుడను బృహన్నలను దలచి
పులకించి పోయదము
పుణ్యరాముని గాంచి
శ్రీ నాధ వేషాన సిరులు కురిసినవన్న
రావళుండాదిగారాజులెల్లరు నీదుఠీవి గని,
ఠారుకొని, పాఠాలు నేర్పమనిఅడుగ
వత్తురేమో బ్రతికి వచ్చి మరల

Friday, June 15, 2007

VISA అపాఇంట్మెంట్ తెలుగు లో

ఈ మధ్య నేను మా బంధువులకి Business\Tourisam వీసా, అమెరికాకి అప్లయ్ చెయ్యటానికి చాలా కష్టపడ్డాను. అందుకే మీకు ముందుగానే ఎలా చెయ్యాలో చెపుదామనుకొంటున్నా. మీకు కావలసిన అన్నీ వివరాలు http://www.immihelp.com/visas/visitor/ లో ఉంటాయి. ఇక నా అనుభవం ప్రకారం తెలుగు లో VISA ఇంటర్వు కావాలంటే నిద్ర లేని రాత్రులు కనీసం ఒక్కటైనా గడపాలి. ఎందుకంటే మధ్యాహ్నం 11:00 CST నుంచి 1:00 CST వరకూ మరలా అర్ధరాత్రి 12:00 CST నుంచి తెల్లవారు ఝామున 3:00 వరకు తెలుగు ఇంటర్వు కోసం ఖాళీలు open చేస్తారు. 3 నుంచి 4 నిమిషాలలో అన్ని ఖాళీలు భర్తీ అయిపోతాయి.

Friday, May 25, 2007

ఉగాది

మొన్నామధ్య మార్చి లొ ఉగాది కి మా ఫ్రెండు పంపించిన శుభాకాంక్షలు విరబూసే మల్లెల పరిమళం
వేలాడే మామిడి తోరణం
కుహు కుహు అని కూసే కోయిలలు
కొత్త వత్సరానికి పలికే స్వాగతాలు
గతం విడిచిన అనుభవాలు
జ్ఞాపకం ఉంచుకొనే విషయాలు
కొత్తదనాన్ని ఆహ్వానించే వే ళచేసుకునే బాసలు
చెప్పుకునే తీపి కబుర్లు
ఉగాది పచ్చడి రుచిలో సర్వ అనుభూతులు
వెరసి కలిసే వే ళ
స ర్వజిత్ సంవత్సర శుభాకాంక్షలు

Thursday, May 24, 2007

తెలుగు తల్లి కవిత

నా స్నేహితుడు విజయ్ పంపించిన తెలుగు తల్లి కవిత ఇదిగో....

ఒక కవిత

ఈ రోజు నాకు నా స్నెహితుని దగ్గర నుంచి ఒక కవిత వచ్చింది. నాకు అచ్చం నా పరిస్తితి చూసి రాసినట్లనిపించింది. ఆ కవితని ఈ క్రింద చూడండి.
హే కృష్ణా ఒక్కసారి ఈ కలియుగంలో రావయ్యా! నీవు పదహారేళ్ళ ప్రాయంలోనే కంసుని చంపావంట
బిన్ లాడెన్ ను కనీసం తాకి చూడు.

నీవు అర్జునునికి గీతాసారాన్ని వినిపించావంట
మా ప్రాజెక్ట్ మేనేజర్ తో ఒక్కసారి మాట్లాడి చూడు.
నీవు అర్జునుని రథసారధివై పాండవులను గెలిపించావంట.
మన భారత క్రికెట్ జట్టుకు కోచ్ వై ప్రపంచ కప్పును గెలిపించి చూడు.
నీవు ద్రౌపదికి బోలెడు చీరలిచ్చి తనను రక్షించావంట
మల్లికా షెరావత్ కు కనీసం ఒక్క ఓణీయైనా వేయించి చూడు.
నీవు గోకులంలో 16,000 గోపికలతో సరసాలాడావంట.
మా ఆఫీసులో ఒక్క అమ్మాయికైనా లైనేసి చూడు.
హే కృష్ణా ఒక్కసారి ఈ కలియుగంలో రావయ్యా
రావయ్యా!