Monday, August 27, 2007

రాఖి

ఆనందం... బాధ...దేహం...మనసు

ఆనందం... బాధ... మనసుకు సంబంధించినవి. దేహం...మనసుకి ఆశ్రయం. మనసు బాధ పడితే దేహం వేదన చెందుతుంది. శరీరానికి బాధ కలిగితే...మనసు మూలుగుతుంది. ఆనందం కలిగినా బాధ కలిగినా దేహం స్పందిస్తుంది. దేహానికి ఏమి జరిగినా మనసు కలత చెందుతుంది. ఆశ్రయ ఆశ్రయీభావ సమ్మేళనం ఇది.

Sunday, August 5, 2007

ఫలానా...

"అసలు చెప్పొద్దనే అనుకొన్నాను. కానీ ఫ్రెండువి కదా అని చెపుతున్నాను. ఫలానా వాడు.. నీ గురించి ఫలానా.. అన్నాడు తెలుసా..??" ఎవరో వచ్చి మన చెవిలో ఊదుతారు. మనకి ఆ మాటలు వినగానే టెంపరేచర్ పెరిగిపోతుంది. "హు.. వాడు నన్ను అంతమాటంటాడా..??"అనుకొంటాం. ఇంకా చాలా చాలా అనుకొంటాం మనలో మనమే. అయితే ఫలానా వాడిని సూటిగా అడగం... ఎందుకంటే అప్పటికే మనలో ఆవేశం హిమాలయమంతగా పేరుకుపొతుంది. అసలు ఫలానా వాడు నిజంగా అన్నాడా? ఒకవేళ అనిఉంటే అదే అన్నాడా..? అదే అని ఉంటే ఏ సందర్భం లో అన్నాడు? ఆ మాటకి ముందు వెనక ఏమన్నాడు? అబ్బే.. ఇవన్నీ ఆలొచించే విచక్షణ ఎక్కడుంది? ఒక బాధ తొ కూడిన ఇగో..అహం... "హు.. వాడికి ఎంత చేసాను..? కృతజ్ఞత లేకుండా ఇలా అంటాడా?" మనలో మనమే కుళ్ళిపోతుంటాం... మహా అయితే ఇంకొకరి వద్దకెళ్ళి "చూసావా..? ఫలానా వాడు నన్ను ఫలానా అన్నాడట... ఫలానా వాడు చెప్పాడు" అంటాం. ఇంకొకరు "అవును ఫలానా వాడంతే... ఫలానా అనే కాదు, ఫలానా ఫలానా .... అని కూడా అనే ఉంటాడు.." అంటాడు. నిప్పు మరికొంచెం రాజుకొంటుంది. "అవును నిజమే.. ఫలానా ...ఫలానా.. కూడా అని ఉండొచ్చు... ఫలానా వాడు మొహమాటపడి చెప్పి ఉండడు. ఫలానా ...ఫలానా.. అనే కాక ఫలానా ...ఫలానా.. ఫలానా ...అని కూడా అని ఉంటాడు!!" మన ఆలోచనలకి రెక్కలొస్తాయి. మొట్టమొదట్లొ మనకా కబురు మొసుకొని వచ్చిన వ్యక్తి తనకి తెలిసిన వాళ్ళందరి దగ్గరకి వెళ్ళి మన గురిచి 'ఫలానా వాడు ' అన్న విషయం ఆకాశవాణి లెవల్లొ ప్రచారం చేస్తుంటాడు. ఇంతా చేస్తే... 'ఫలానా' అన్నట్లుగా చెప్పబడిన వ్యక్తి మాత్రం సుఖంగా, సంతొషంగా ఉండొచ్చు. ఎందుకంటే తానా మాటలు అని ఉండకపోవచ్చు. అన్నా వేరే మంచి ఉద్దేశంతోనే అని ఉండొచ్చు..... ఇదండీ విషయం.

Saturday, August 4, 2007

తెలుగు

"తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు రేడ నేను తెలుగొకండ
యెల్లవారు వినగ యెరుగవే బాసాడి

దేశ భాష లందు తెలుగు లెస్స"- శ్రీ కృష్ణదేవరాయలు


"తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది!
తెలంగాణ నాది, నెల్లూరు నాది, సర్కారు నాది, రాయలసీమ నాది!
అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదే రా! " - సి.నా.రె

Maroo Kavita

నీ స్నేహ మధురిలో ఝరిలో
తరించి తడిసి నేను..

నీ నవ్వుల వెన్నెలలో అలలో
విరిసి మురిసి నేను..

నీ మనసు ముంగిలిలో
చలిలోనిలిచి వేచి నేనూ…

* * * * *
నా వల్ల కాదు
నీ జ్ఞాపకం చెరపటం నా వల్ల కాదు
నిను మరవడానికి చేసే ప్రతి ప్రయత్నం లో
మరో జ్ఞాపకమైపొతున్నావు

వెన్నెల వెలుగులో వాన చినుకుల్లో సంద్రపు అలల్లో....
కలసి పంచుకున్న క్షణాలే కనిపిస్తున్నాయి
దూరమవుతున్నాననుకుంటూ...
మరింత దగ్గరైపోతున్నాను.
జ్ఞాపకాలు చెరిపేస్తున్నాననుకుంటూ..
ప్రతి ఆలోచనలో నిను పొందుపరిచేస్తున్నాను.
ఇప్పటికి అర్దమయింది...
నేను వదులుకుందామనుకుంటుంది
నీ జ్ఞాపకాన్నే గానీనిన్ను కాదు అని...