Wednesday, September 26, 2007

వన్నెల స్వప్నాలు

వెలుగుల వాహినిలో
కిరణాల కెరటాలపై
విహరిద్దాం రా!
వెన్నెల రేయిలో
వన్నెల స్వప్నాలు
ఆవిష్కరిద్దాం రా!

Thursday, September 20, 2007

మహా ప్రస్థానం

మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
పోదాం!పోదాం!పై పైకి!
కదం తొక్కుతూ,
పదం పాడుతూ,
హ్రుదయాంతరాళం గర్జిస్తూ
పదండి పోదాం
వినపడలేదా మరోప్రపంచపు జలపాతం? -------

Sunday, September 16, 2007

పోతన గారి ఒక గొప్ప పద్యం

పోతన గారి శైలి భిన్నమైనది. మిగతా కవుల్లా కాకుందా ఆయన మమూలు పదాలతొ పదవిన్యాసం చెస్తారు. మహాభాగవతం లోని గజేంద్రమొక్షం లొ ఈ పద్యాన్ని చూడండి. అతి సాధారణ పదాలతొ ఎలా విన్యాసాలు చెసారొ!
కరి అంటే ఏనుగు, మకరి అంటే మొసలి. ఇంక కవిగారికి అంతకంటే ఏమి కవాలి ? చిన్ని మాటలతో అద్భుతమైన పద్యాన్ని సౄష్టించారు. చదివి ఆనందించడి.

ముక్కు తిమ్మన గారి అద్భుతమైన romantic ముక్కు పద్యం.

మనము హిందీ poetry చదివి, లెకపొతే హిందీ పాటలు వినీ, ఆ చచ్చు సాహిత్యాన్ని "ఆహా ఓహొ" అని మెచ్చుకొంటాము. కాని మన తెలుగులో ముక్కు తిమ్మన గారు తన ప్రియురాలి ముక్కు పైన ఎంత అద్భుతమైన కవిత రాశారొ మనలో చాలామందికి తెలియదు. ఇది నిస్సందేహంగా ప్రపంచం లొ top 10 పద్యాల్లో ఒకటిగా నిలుస్తుంది. క్రింది పద్యాన్ని చదవండి. అర్ధం నేను వివరిస్తాను.

నాన సూన వితాన వాసనలనానందించు
సారంగమేలా తన్నొల్లదటంచు
గంధఫలి బల్కానల్ తపంబొంది యోశానాసాకృతి బూనె సర్వసుమన
సౌరభ్య సంవాసియైబూనెం బ్రేంఖణ
మాలికా మధుకరీపుంజంబులిర్వంకలన్


అన్ని పుష్పాలమీదా వాలే తుమ్మెద తనమీద ఎందుకు వాలదు అని అలిగిన సంపెంగపూవు భయంకరమైన అడవులలొకి పోయి తపస్సు చేసి దేవుడి దగ్గ్గిర వరం తెచ్చుకుందిట. అది ఏమిటంతే ఇతని ప్రియురాలి ముక్కు గా పునర్జన్మించి అన్ని పూవుల వాసనలని ఆనదిస్తూ రెందు తుమ్మెదలని ఇరువైపులా మాలగా ధరించిందిట.

ఆహా, అద్భుతమైన పద్యం. మహా ప్రసాదం.

Sunday, September 2, 2007

మరువ లేకున్నా...

మరచిపోవాలనుకుంటున్నా కానీ...
నీ చూపు తాకిన మరుక్షణాన
ఆ విషయాన్ని మళ్లీ మరచిపోతున్నా

మాటల్లో పడకూడదనుకుంటున్నా కానీ..
నీ పెదాలు అలా ఇలా మెదిలే సమయాన
దాన్ని అలాగే పట్టించుకోక వదిలేస్తున్నా

నీ వయ్యారి నడుము ఊయలూగితే
కిలకిలమని చెలరేగిపోతున్నాయి

నాలోని మధుర భావాలునీ
గజ్జెల సవ్వడి విన్పించగానే
ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి

నా గుండెల్లో అలజడులు ప్రియా!
నాపై ఎందుకింత కోపం
ఇకనైనా వీటిని చాలించవా
నా బాటన నన్ను సాగనియ్యవా

ఎంతెంత అందం...

నిద్రపోతున్నాను
ప్రపంచమంతా కలలోకి వచ్చింది

ఆ కలలో...

లాలించే అమ్మ
ప్రేమను పంచే నాన్న
జ్ఞానంతో పెంచే గురువు

నాతో ఆడుకునే అక్కయ్య... అన్నయ్య
నన్ను వదలని తమ్ముడు, చెల్లాయి
ఎప్పుడూ ఎదురు చూసే స్నేహితులుఅంతేనా...

సహనానికి స్త్రీ మూర్తి
నిర్మలమైన పాపడి నవ్వు
లావణ్యమూర్తులు తరుల్లతలు

ఇంకా...ప్రశాంత గగనందానికి అలంకారంగా తారామణులు
మాలిన్యాన్ని కడిగేసే గంగకారుణ్యాన్ని కురిపించే దైవం
అన్నీ ప్రేమకు ప్రతిరూపాలే
ఆప్యాయతకు మారుపేర్లు
అనురాగానికి దర్పణాలు
అందాలకు అనుబంధాలు

మెలకువ వచ్చింది
అప్పుడు అర్థమైంది
అందమైనవన్నీ నాకిచ్చి..
ఆనందాలను పంచిన
ఆ సృష్టికర్తది ఎంతెంత అందం!

Saturday, September 1, 2007

నాకై నేను ఉదయించనీ

కనీసం నా మనసేమంటుందో తెలుసుకోనీ
కాసేపు నన్ను నేనైనా చూసుకోనీ
నా ముఖాన్ని గుర్తు పట్టనీ
నా గొంతును కాసేపు నన్నుగా విననీ
నన్ను నేనైనా కాస్సేపు అనుభవించనీ
నాకైనేను అర్థం కానీ

నేనొక ముఖం కోసం వెతుకుతున్నాను
కానీ ఏం లాభం!
ఒక నమ్మకమైన అద్దం దొరకడం లేదు
ప్రతి దర్పణమూ దాన్ని తయారు చేసిన వాడి ముఖమే చూపిస్తోంది
నన్ను నన్నుగా చూపించే అద్దం లభించనీ!

అనుభవానికి దాని సత్యం అనర్థం
ఆ సత్యాన్ని నన్ను నేనుగా అనుభవించనీ!
ఈ నిశ్శబ్ధ నిరామయ నిశీధిలో నన్ను ఇలా ఉండనీ
సంపూర్ణమైన ఈ నిశీధ నిశ్శబ్ధ సంగీతం నన్ను ముంచి వేయనీ
ఆ ఉదయాన్ని నేనే జయించనీ!

Intresting....

A hen is only an egg's way of making another egg. How is it?

ఆదర్శం

ఆదర్శాలని బోధించే వాళ్ళు కొంత మంది, ఆదర్శాలని వల్లె వేసేవాళ్ళు కొంతమంది, ఆదర్శాలని ఎలుగెత్తి చాటేవాళ్ళు కొంత మంది,ఆదర్శాల ముసుగులొ స్వలాభం కోసం, సొంత లాభం కోసం పాకులాడేవాళ్ళు కొంత మందీ.... ఎవరు నిజమైన ఆదర్శవంతులు...?? ఇది నాకు అంతులేని ప్రశ్న.. ?? ఎవరైనా తీర్చగలరా....?