Sunday, October 21, 2007

కవిత్వం అంటే

కవిత్వం అంటే స్వచ్చందంగా జీవితాన్ని ఆరుబయట వదిలేయడం
జారుకుంటున్న మాయలేడి వెంట పరిగెత్తడం
కవిత్వం అంటే సకల బంధనాల్నీ వదిలించుకోవడం
పవనాల్లో పత్రంలా ఎగరడం
కవిత్వం అంటే భయాన్ని వదలడం - గొంతెత్తి నిర్భయంగా పాడడం
కవిత్వం అంటే మొహమాటాల్ని వదలి నిన్ను నువ్వు వినడం
కవిత్వం అంటే జన సమ్మర్దంలో నిద్రపోయే నీ అస్తిత్వాన్ని తట్టిలేపడం,కవిత్వమంటే ఆనందించడం
కవిత్వమంటే నిర్భయత్వం, కవిత్వమంటే నిర్వికారత్వం
కవిత్వమంటే స్వాతంత్ర్యం
కవిత్వమంటే కురిసే వెన్నెల్లో పరుగెత్తడం - వెన్నెల్లో హల్లీసకం ఆడడం
కవిత్వమంటే ఎండల్లో సాగరతీరంలో కొండవూట నీళ్లు తాగడం


కలలు కనడం కవిత్వం,
కరువుతీరా ఏడవడం కవిత్వం,
కడుపు చెక్కలయ్యేట్టునవ్వడం కవిత్వం,
నీర్హేతుకమైన నీ సందేహాల్ని వదలి,
నిష్ర్పయోజనమైన నీ అనుమానాల్ని విడిచి, యధాతథంగా సంపూర్ణంగా బతికేయడం కవిత్వం,
నీ తడబాటు పలువల్ని వదలిపెట్టి జీవితసరసులో ఈదడం కవిత్వం,
జ్వాలా కమలాన్ని అందుకోవడం కవిత్వం

Tuesday, October 9, 2007

నేను - జమజచ్చ - షైలా భాను

బూదరాజు అశ్విన్ గారు తన బ్లాగ్ లో " నేను - జమజచ్చ - షైలా భాను " పేరు తొ ఒక పోస్టు వ్రాసారు. చదువుతుంటే చిలకమర్తి, గురజాడ రచనలు చదివితే ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో అలా ఉంటుంది.

Monday, October 8, 2007

బలి

ఏవండోయ్... ఈ రోజు మన పెళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది సుగుణ. "ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్.

మగ చెవి - ఆడ నాలుక

ఒక ప్రమాదంలో రెండు చెవులనూ పోగొట్టుకుంది సుందరి. శస్త్ర చికిత్స చేసి ఆమెకు కొత్త చెవులను అమర్చాడు డాక్టరు. వారం తర్వాత సుందరి ఆ డాక్టరు దగ్గరకెళ్ళి ” నాకు పెట్టిన చెవులు మగవాళ్ళవి” అంది కోపంగా. “అయితే ఏమయింది? చెవులు ఎవరివైనా చెవులేకదా! సరిగా వినపడాలి గాని! ” అన్నాడు డాక్టరు. “అలా ఎలా అవుతాయి? ఎదుటివాళ్ళు చెప్పినవన్నీ నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కాని ఒక్కటీ చెయ్యబుద్ధి కావట్లేదు” అని వాపోయింది సుందరి. అదే ప్రమదంలో తన నాలుకను పోగొట్టుకున్నాడు సుబ్బారావు. అతనికి శస్త్రచికిత్స చేసి కొత్త నాలుకను అమర్చాడు అదే డాక్టరు. వారం తర్వాత “నాకు ఆడవాళ్ళ నాలుక ఎందుకు అమర్చారు?” అని డాక్టరు మీద కేకలేసాడు సుబ్బారావు. “అయితే ఏమయింది? నాలుక ఎవరిదైనా నాలుకే కదా! మాట్లాడటం వస్తుంది కదా!” అన్నాడు డాక్టరు. ” అలా ఎలా అవుతుంది? ముందునుండి నాకు ఎక్కువగా మాట్లాడటం అలవాటు లేదు. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ఎదో ఒకటి ఎడతెరిపి లేకుండా మాట్లాడుతూనే ఉన్నాను” అని బాధపడ్డాడు సుబ్బారావు.

Friday, October 5, 2007

చీ!! ఈ వెధవ బ్రతుకు!!!!!!!!!!!!

కాలెజీ లో ఉన్నన్నాళ్ళూ చదువులు ఎప్పుడు అయిపొతాయో, పరీక్షల నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో, ఉద్యోగం లో చేరి డబ్బులు ఎప్పుడు సంపాదిస్తామో అని… ఉద్యొగవేటలో నానా తిప్పలూ పడి, నానా గడ్డీ తిని, చివరకు ఎలాగో ఉద్యోగం సంపాయిస్తాం।

ఉద్యోగం లో జాయిన్ అవుతాం
మొదటి నెల: పని తక్కువ – ఎంజాయ్ ఎక్కువ – ఆల్ హాపీస్
రెండో నెల: పని – ఎంజాయ్ – ఓకే
మూడో నెల: పని – పని – నో ఎంజాయ్ – సమస్యలు మొదలు ...


అప్పటికి ఆఫీసు రాజకీయాలు తెలుస్తాయి.
పక్క టీము మేనేజర్ మంచోడు అవుతాడు.
పక్క టీము లో అమ్మాయిలు\అబ్బాయిలు బాగుంటారు.
పక్క టీము లో జీతాలు తొందరగా పెరుగుతాయి
పక్క టీము లో అస్సలు పనే ఉండదు.
మనకి మాత్రం రోజూ దొబ్బించుకోవటమే…

ఒక్కొక క్లయింటు ఎమో పిచ్హి నా Requirements ఇస్తాడు. అవి పని చెయ్యవని తెలిసీ అలానే చెయ్యాలి.
వాడిని అమ్మనా బూతులూ తిట్టి వెళ్ళిపొదాం అనిపిస్తుంది.
కాని ఆ ఆఫీసులో నెట్ , కాఫీ ఫ్రీ అని గుర్తుకొస్తుంది.

మనలాంటి వాళ్ళ తో ఒక బాచ్ తయ్యారవుతుంది. వారానికి ఒకసారి మందు కొట్టి మన PLని TLని తిట్టటం మొదలు పెడుతాం. అలా ఆరునెలలు గడిచిపోతాయి.
ఇక లూపు లో పెట్టి కొడితే రెండు సంవత్సరాలు గడచి పోతాయి. కళ్ళ క్రింద నల్ల చారలు, వలయాలు… వళ్ళు నొప్పులు.. మెడ నొప్పులు… వేళ్ళు వంకర్లు… వగైరా…


అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు వీళ్ళందరినీ చుట్టపు చూపుగా కలవాల్సొస్తుంది। వీళ్ళల్లొ ఎవరైనా మనలాంటి ఉద్యోగం లో ఉంటే మన పరిస్థితి అర్థమవుతుంది. లేకపోతే… ఫోను చేసిన ప్రతిసారీ సంజాయిషీ చెప్పుకోవాలి….

వచ్చిన జీతాన్నంతా క్రెడిట్ కార్డుల బిల్లులలకి, తాగటానికి తగలేస్తాం. ఈ జీవితం అలవాటయిపొతుంది. అలా జీవితం ప్రశాంతంగా గడచి పొతుడగా ఒకరోజు మన కొలీగు తన పెళ్ళి అని పిలుస్తాడు. మనకి కూడా పెళ్ళి చేసుకోవాలనే వెధవ ఆలోచన ఒకటి పుడుతుంది. మన S/W లో అమ్మాయిలంతా పెళ్ళి అయినోళ్ళు, ఆల్రడీ కమిట్ అయినోళ్ళు లెకపొటె ఉత్తర భారత దేశపు వాళ్ళు అయి ఉంటారు. వందలో తొంభయైదు మంది పోగా… మిగిలిన అయిదుగురి లో నలుగురు అక్క అంటే నే బెటర్ అనే లాగా ఉంటారు.

ఇక మిగిలింది ఒక్కరు. ఆ ఒక్క అమ్మాయికోసం, టీం అంతా ఊరకుక్కల్లాగా కొట్టేసుకొంటాం.
ఆ అమ్మాయి మాత్రం, ఎవ్వరి తోనూ కమిట్ కాకుండా, అందరితొ పబ్బం గడిపేస్తూ ఉంటుంది.
ఒక మంచి రోజు చూసి, నాకు మా బావ తో పెళ్ళి అని పెళ్ళి పత్రికలు పంచుతుండి.
మనమదరం, ఆ అమ్మాయి మంచిది కాదు అని డెసైడు చేయటానికి మందు కొడతాం.
ఇంకొక అమ్మాయి కోసం ప్రయత్నాలు మొదలు.

ఉద్యోగం లో reviews వస్తాయి. “నువ్వు ఎక్సలెంట్..
నువ్వు లేనిదే మా కంపెనీ లేదు… కత్తి కమాల్…“లాంటివెన్నో చెపుతారు.

చివరలో… “కానీ…” అని ఒక్క మాటతో గాలి తీస్తారు…

నీ జీతం లో ఒక శనక్కాయ పెంచాం ఫొ! అంతారు.
మనం సణుక్కొటూనె…
అదే శనక్కాయల మీద బ్రతికేస్తుంటాం….


జీవితం అంతా దూరదర్సన్ ప్రసారాలలానే ఉంటుందా…??
వేరే ప్రొగ్రాములు ఉండవా…?


చీ!! ఈ వెధవ బ్రతుకు!!!!!!!!!!!!


Wednesday, October 3, 2007

చేతగాని 'మనం'

మన దేశంలొ హేతువాదం, చదువుకొన్నవారి తెలివితేటలు, బరితెగించిన శాస్త్రీయ దృక్పదం ఏ దశకు పోయిందంటే- లక్షల సంవత్సరాల సాంస్కృతిక మూలాధారాన్ని- కేవలం తమకు తెలిసిన పరిజ్ఞానంతో, కోట్లమంది 'విశ్వాసాన్ని ' అయినా దృష్టిలో పెట్టుకొకుండా- కోర్టులకి ఎక్కి కుక్కగొడుగుల్లాగా బుకాయించే స్థాయికి వచ్చింది. ఈ దేశంలొ 'రాముడు ' ఉన్న చాయలు లేవని సుప్రింకోర్టుకి అఫిడవిట్ ఇచ్చిన ప్రభుద్దుల ఫొటోలని ఒసామా బిన్ లాడెన్, ముల్లా ఒమర్, దావూద్ ఇబ్రహీం సరసన అంతే ప్రముఖంగా ప్రకటించి మమ్మలని తరింపచేయాలని ప్రార్ధిస్తున్నాము.

ఇంతకీ ఈ దేశ ప్రజలు గాజులు తొడిగించుకొని కూర్చున్నారు! ముఖ్యంగా హిందువులు! డేనిష్ పత్రికలొ తమ దేవుడిని వెక్కిరిస్తే - ఇండియా కార్లని తగులబెట్టే ఈ ప్రభుద్దులు; తన తల్లి ఒంటికి మాత్రం నిండుగా బట్టలు తొడిగి, నగ్నంగా ఉన్న సీతని నగ్నంగా ఉన్న హనుమంతుని తొడమీద కూర్చొబెట్టినా, మన పార్వతిని, మన సరస్వతిని ఎలా చిత్రీకరించినా మనకు మాత్రం సిగ్గు ఎగ్గు ఉండదు! పైగా అలాంటి గొ...ప్ప చిత్రకారులకి పద్మభూషణ్ ఇచ్చి చంకలు గుద్దుకున్న వ్య(అ)వస్త మనది!

'హజ్' వెళ్ళటానికి సహాయం చేస్తున్నారు కదా! మేము కూడా కాశి వెళ్ళొస్తాం సహాయం చెయ్యండి అని అడగలేని దద్దమ్మలం మనం!


నేను విశ్వహిందూ పరిషత్ సభ్యుడిని కాదు. గంటకొకసారి రంగుమార్చి మతం తో ఆడుకొనే రాజకీయ నాయకుడిని కాదు. మత చాధసం పేరిట పొరుగు దేశాల ఎంగిలి బుధ్ధుల మేధావి పార్టీల మనిషిని కాదు. ఏ పార్టీకి తాకట్టు పెట్టటానికి సిధ్ధంగా లేని ఆత్మాభిమానం ఉన్న హిందువుని.

గల్లీ బుద్దులున్న ఢిల్లీ పెద్దలారా! పార్లమెంటు మీద దాడి చేసిన వాడిని ఉరి తీయమని కోర్టు ఆదేశించినా, అలా చెయ్యలేని మీ చేతగాని తనాన్ని మీదగ్గరే ఉంచుకోండి. ఖత్రొచీలను మన వ్యవస్త చేతులు కట్టి కాపాడుకోండి. గడ్డితినే నాయకులని, హత్యల వీరులని అందలాలు ఎక్కించుకోండి. మా రాముడిని మాత్రం మాకు వదిలెయ్యండి.

హిందువులారా! మనం అన్యమత సోదరులాగా బస్సులమీద రాళ్ళు వెయ్యొద్దు. రాళ్ళు రువ్వి పక్కవాడి ఇళ్ళు నాశనం చెయ్యొద్దు. మన చేతులనిండా రకరకాల రంగుల గాజులున్నాయి. కనీసం ఇప్పుడైనా మన రాముడి కొసం ఒక్కొక్క గాజు తీసి పక్కన పెట్టండి. లెకపొటే, మనం ఇలాగే ఉంటాం. ముక్కోటి దేవతలలో ఏ ఒక్కరూ మిగలరు.

- గొల్లపూడి గారి కాలం "ఒక గర్జన" ఆధారంగా!

Tuesday, October 2, 2007

వర్షం

కడలి ప్రియుని
చిరుగాలుల చల్లని స్పర్శకు...
మబ్బు కన్నెలు పులకించి
మేను మైమరచి
ఆనంద భాష్ప పుష్పాలు
వర్షిస్తున్నాయి.