Wednesday, February 24, 2010

బాల్యం కావాలి

ఉపన్యాసాలూ, నినాదాలూ

ఉద్యమాల నినాదాలు, స్త్రీవాదం జాడలూ
దరికేవీ చేరని దూరతీరాల జీవితం కావాలి

ఏటి గట్టు, నీటి బిందె
మట్టి దోవా, ఊరిసేవా జీవితం కావాలి

తాను కోల్పోయిందేదో, పొందిందేదో తనకే తెలియని బాల్యం కావాలి.

Saturday, February 20, 2010

నీ స్నేహం...


నా ఊపిరితో ఊపిరి పోసుకొన్న ఈ రాగానికి
కనుచూపుమేరా పచ్చదనం వెల్లివిరుస్తుందనీ
అడుగడుగునా ఆమని విరబూస్తుందనీ 
ఎన్ని ప్రశంసలు .. ఎన్ని పొగడ్తలు....
ఎన్ని అభినందనలు... ఇంకెన్ని ఆశీర్వచనాలు...!
ఎవరేమన్నా నేస్తం... నా మనసుకి తెలుసు
ఈ గానానికి గమ్యం.. నన్ను సేదదీర్చే నీ హృదయం 
ఈ స్వరార్చన లక్ష్యం... బతుకును వెలిగించే నీ స్నేహం...!

Wednesday, February 17, 2010

నమ్మకం


నమ్మకమే నేస్తమయినప్పుడు
ఆకురాలు కాలంలోనూ
ఆమనిగీతం వినిపిస్తుంది!
నమ్మకాలు వమ్మైనప్పుడు 
తోడయిన నీడ సైతం
నువ్వెవరని ప్రశ్నిస్తుంది...!!!

Tuesday, February 16, 2010

కట్నం ఎంతిస్తారు?

తనింట్లో అద్దెకు వచ్చిన కుర్రాడితో చెప్పిదో పెళ్లి కానీ ఆడపిల్లల తల్లి...

"చూడు బాబూ... నాకు మొగుడు లేడు. పెళ్ళికి ఎదిగిన కూతుర్లు ఉన్నారు. నువ్వా... బ్రహ్మచారివి. నేనా ముసలిదానిని.. పెళ్ళికొడుకుల కోసం తిరగలేను. కాబట్టి నువ్వు మా అమ్మాయిలలో ఎవరినయినా చేసుకొంటే తగిన కట్నమిస్తాను"

"కట్నం ఎంతిస్తారు?"

" అది నువ్వు చేసుకొనే అమ్మాయి మీద ఆధారపడి ఉంటుంది. మా ఆఖరి అమ్మాయి వయసు ఇరవై. దాన్ని చేసుకొంటే ఐదు లక్షలిస్తాను. దాని పైదాని వయసు ఇరవై ఐదు. దాన్ని చేసుకొంటే పది లక్షలిస్తాను. దాని పైదాని వయసు ముప్పై. దాన్ని చేసుకొంటే పన్నెండు లక్షలిస్తాను. దాని పైదాని వయసు ముప్పై ఐదు. దాన్ని చేసుకొంటే పదిహేను లక్షలిస్తాను. "

"అలాగా.. ! అయితే మీకు నలభయ్ ఐదు వయసుండే అమ్మాయిలు లేరా??" అని ఆశగా ప్రశ్నించాడతాను. :-)



మనసు రాయబారం

ఈ గుండె గాయాల్ని మోసుకొంటూ
రాయబారం కోసం వస్తోంది
ఆశల అంచులపై పయనించే రాయంచ...!
నీ పలకరింపుల చినుకులతో పునీతం చేస్తావో...
కసి చూపుల జడివానలో ముంచేస్తావో....
ఏదయినా నేస్తం...
తిరుగు సందేశం మాత్రం నన్ను చేరనీ..!!!