skip to main |
skip to sidebar
మగ చెవి - ఆడ నాలుక
ఒక ప్రమాదంలో రెండు చెవులనూ పోగొట్టుకుంది సుందరి. శస్త్ర చికిత్స చేసి ఆమెకు కొత్త చెవులను అమర్చాడు డాక్టరు. వారం తర్వాత సుందరి ఆ డాక్టరు దగ్గరకెళ్ళి ” నాకు పెట్టిన చెవులు మగవాళ్ళవి” అంది కోపంగా. “అయితే ఏమయింది? చెవులు ఎవరివైనా చెవులేకదా! సరిగా వినపడాలి గాని! ” అన్నాడు డాక్టరు. “అలా ఎలా అవుతాయి? ఎదుటివాళ్ళు చెప్పినవన్నీ నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కాని ఒక్కటీ చెయ్యబుద్ధి కావట్లేదు” అని వాపోయింది సుందరి.
అదే ప్రమదంలో తన నాలుకను పోగొట్టుకున్నాడు సుబ్బారావు. అతనికి శస్త్రచికిత్స చేసి కొత్త నాలుకను అమర్చాడు అదే డాక్టరు. వారం తర్వాత “నాకు ఆడవాళ్ళ నాలుక ఎందుకు అమర్చారు?” అని డాక్టరు మీద కేకలేసాడు సుబ్బారావు. “అయితే ఏమయింది? నాలుక ఎవరిదైనా నాలుకే కదా! మాట్లాడటం వస్తుంది కదా!” అన్నాడు డాక్టరు. ” అలా ఎలా అవుతుంది? ముందునుండి నాకు ఎక్కువగా మాట్లాడటం అలవాటు లేదు. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ఎదో ఒకటి ఎడతెరిపి లేకుండా మాట్లాడుతూనే ఉన్నాను” అని బాధపడ్డాడు సుబ్బారావు.
2 comments:
భలే మగ చెవి ఆడ నాలుక
చాలా బావుంది
ఆలోచన బావుందండి
Thank you Aswin gaarooo
Post a Comment