అష్టావధానం అనే పేరు విన్నారా...? ఇది ఒక సాహిత్యపు ఆట అని చెప్పవచ్చు। ఒక పండితునికి ఎనిమిదిమంది పండితులు ఎనిమిది ప్రశ్నలు ఇస్తే ఆతడు ఛందొబద్ధ కవిత్వ రూపమయిన పద్యాలలో చెప్పాలి. అదీ ఒక పదం తరువాత మరొక పాదం అప్పటికప్పుడు చెప్పాలి . చివరగా నాలుగు పాదాలూ వప్పచెప్పాలి. అందులో ఎనిమిది ప్రశ్నలూ రక రకాలుగా ఉంటాయి. వాటిలో దత్తపది ఒకటి. దత్తపది అంటే నాల్గు పదాలు ఇచ్చి వాటిని నాల్గు పాదాలలోనూ కావలసిన అర్థంలో అవధాని చెప్పడం అందులో చిత్రమైన అర్థము ఉండాలి.
ఉదాహరణకి
దోసె, పూరీ, వడ,సాంబారు అనే నాలుగు పదాలని నాల్గు పాదాలలో ఇముడ్చుతూ ఆ శబ్దంలోనిఅర్థంలో చెప్ప కూడదనేది నియమము
ఈ పద్యాన్ని చూడండి
వర్ణన: శివ కల్యాణం। శివుడికి దోసె, పూరీ ,వడ, సాంబారు అంటకట్టాలి।
పద్యం:
జడలో దోసెడు కొండమల్లికలతో సౌరభ్యముల్ చిమ్మి వ
చ్చెడు పూరీతిగ హాస చద్రికలతో సింధూరసీమంతియై
వడకున్ గుబ్బలి ముద్దుపట్టినుదుటన్ వాసంతియై నిలుచు ఆ
పడతిన్ పత్నిగ స్వీకరించితివి సాంబారుద్రా! సర్వేశ్వరా!!
ఈ పద్యంలో మొదటి పదంలోని జడలో దోసెడు అంటూ దోసె అనే శబ్దాన్ని దోసెడు నిండుగా అని వేరే అర్థంలో ఉపయోగించారు।రెండవ పాదంలో పూరీతిగ అనే చోటా పూరీ అనే శబ్దాన్ని పూవు వలే అనే వేరే అర్థంలో ఉపయోగించారు। అలాగే మూడవ పాదంలో వడ అనే శబ్దాన్ని వడకిపోవడం అనే అర్థంలో ఉపయోగించారు.
ఇక నాల్గవ పాదంలో చివరి భాగంలో సాంబా రుద్రా అంటూ సాంబారు అనేశబ్దాన్ని ఉపయోగించారు. ఇలాగ తెలుగు భాషకు మాత్రమే ఉన్న సౌలభ్యం.
మరొక దత్తపదిని చూద్దాం-
బీరు,బ్రాంది, విస్కీ,రమ్ము అనే నాలుగు పదాలూ నాలుగు పాదాల్లో వాడుతూ పద్యం ఆ శబ్దార్థాన్ని వాడకుండా చెప్పిన పధ్యం చూద్దం।
అతివా గుండెలబీరువా తెరచి నీకర్పించుకుంటిన్ గదా
అతుల ప్రేమ మనోజ్ఞత్వము ఇక నబ్రాందీ కృత శ్యా
మతాన్వితమైన కటిసీమవెల్గు హృదయావిష్కీర్ణ సంకార్యమై
రతివో! రంభవో! రాధికారమణివో! రావే జగజ్జిన్నుతిన్।
ఈ పద్యంలో మొదటి పాదంలో గుండెలబీరువా అని "బీరు" అబ్రాందీకృత అని "బ్రాందీ" అనే శబ్దాన్ని హృదయావిష్కీర్ణ అనే చోట "విస్కీ" రంభవో అనే చోట "రం"అనే శబ్దాలు చెప్పడమేకాక జగజ్జిన్నితిన్ అనే చోట " జిన్" అనే శబ్దాన్ని కూడా చెప్పడం విశేషం । ఇది కవి చమత్కారానికి వన్నె తెస్తుంది.
ఒక్కకప్పుడు చాలా బాధగా ఉన్నవారిని ఊరడించడానికి మంచి ఉపాయం సహిత్యం. కొన్ని పద్యాలు వింటే ఎంత బాధనైనా మరచిపోతాం. ఉదాహరణకి
తెలుగులో గాడిద అని గాడిదకొడకా అని పిల్లల్ని తిడుతూ ఉంటాం. అప్పుడు ఒక గాడిద విని ఇలా అనుకొంటోంది-
ఆడిన మాటను తప్పిన
గాడిదకొడుకంచు తిట్టగా విని
వీడా నాకొక కొడుకని
గాడిద ఏడ్చెన్ గదన్నఘన సంపన్నా!!
నన్నిడిసిపెట్టెల్లినాడే! మొన్న తిరిగోస్తానన్నాడే!!
-
*నన్నిడిసిపెట్టెల్లినాడే,*
*నా రాజు....*
*మొన్న తిరిగోస్తాననాడే నా రాజు!*
*నీలు తేబోతుంటే, నీ తోడే... వోలమ్మ!*
*నాయేంట ఎవరోను నడిసినట్టుంతాదే!*
*నన్నిడిసిప...
14 years ago
12 comments:
చాలా చక్కని పద్యాలతో తెలుగు భాషలోని మాధుర్యాన్ని మరొక్కసారి రుచి చూపించారు. అభినందనలు. మీ ప్రయత్నం హర్షణీయం. అప్పుడప్పుడైనా ఇలా ఇంకొకసారి మరి కొన్నిటిని గుర్తు/పరిచయం చెయ్యండి.
Hi,
Can you please add indiaeveryday
button to your blog.
http://www.indiaeveryday.com/rf_feedback_buttons__IndiaEveryday_buttons.htm.aspx
Thanks,
Krishna
బావున్నాయి, మీ కబుర్లు. పూరీ, దోశ పద్యం మాడుగుల వారిది అని గుర్తు.
చివరి కంద పద్యం లో రెండో పాదం చివర్లో "అకటా" విడచినట్టున్నారు.
- ఊకదంపుడు
http://vookadampudu.wordpress.com
బాగుంది మీ అవధాన విశ్లేషణ. అక్కడక్కడా వున్న చిన్న దోషాలు తప్పితే పద్యాలని కూడా చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నారు. ఉదాహరణకు "సాంబా రుద్ర" అని వుండాలి "సాంబా రుద్రా" అనిగాదు, "చంద్రికలతో"లో పూర్ణానుస్వారం అదృశ్యమైపోయింది, అలాగే ఆఖర్నున్న కందపద్యంలో (అదేవిఁటో నాకు తెలీదుగానీ) ఒక పదం పదం మొత్తం పుట్టింటికి వెళ్లిపోయింది. సరీగ్ఘా కొద్ది నెలల క్రితం వరకూ కూడా ఆంధ్రభూమి దినపత్రికలో ఆదివారం నాడు అవధానం శీర్షికన అవధానులగురించి వారి అవధానవిశేషాలగురించి ప్రచురించేవారు. ఇప్పుడేమైందో గానీ అది హఠాత్తుగా ఆగిపోయింది. మొత్తానికి మంచి టపాని అందించారు.
పద్యాలు బాగున్నయి. ఆ అవకాశము సంస్కృతానికి కూడా ఉన్నట్లు ఉన్నది.
భలేగా ఉన్నాయి పద్యాలు..
తెలుగు'వాడి'ని గారూ (క్షమించాలి. మీ అసలు పేరు నాకు తెలియదు...)చాలా మంచిదండి.. మీ సూచనలకు ధన్యవాదములు.
Krishna గారూ ...
నేను మరొక సారి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం... "Cannot add the URL" అని సందేశం వస్తుంది....
ఊకదంపుడు గారూ (క్షమించాలి. మీ అసలు పేరు నాకు తెలియదు...) అవునా... నా దగ్గర ఉన్న పుస్తకం లో అలా లేదండి...మరలా చూసి సరి చేస్తాను.
రాఘవ గారూ! బాగుంది మీ విశ్లేషణ. మీ సూచనలకు ధన్యవాదములు. తప్పులను సరిదిద్దేటందుకు ప్రయత్నిస్తాను.
బ్లాగేశ్వరుడు గారూ (క్షమించాలి. మీ అసలు పేరు నాకు తెలియదు...) దత్తపది కేవలం తెలుగుకు మాత్రమే సొంతం అని విన్నాను. మీకు స్పష్టం గా తెలిస్తే చెప్పండి... అలాగే మార్పు చేద్దాం.
గిరి గారూ ధన్యవాదములు.
Post a Comment