Saturday, March 22, 2008

హుర్రే!!!

హుర్రే!!!నేను నా నాలుగు సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేసాను. ఇంతకీ నేను ఏమి సాధించానో అని చూస్తే నాకు ఎమీ కనిపిచలేదు...హుర్రే!!! ఏమీ సాధించ కుండా నాలుగు సంవత్సరాలు గడపడం సామాన్యమా చెప్పండి...?? అందుకే ఎవ్వరూ సాధించలేనిది నేను సాధించానని ఎగిరి గంతేస్తూ హుర్రే!!! అని అరిచాను.

ఇంతలోనే నాలాగా నాలుగేళ్ళు పనిపాటాలేకుండా గడిపిన మా స్నేహితుడు ఒకడు నాకు ఫోను చేసాడు... మామా! పార్టీ చేసుకొందాము అని... ఇంకొక సారి హుర్రే!!! అని ఎగిరి గంతేసాను. ఈసారి రెట్టింపు ఆనందం. ఎందుకో తెలుసా..??మొదటికారణం: నాలాగా నాలుగేళ్ళు పనిపాటాలేకుండా ఉన్న ఇంకొకడు దొరికాడని; రెండు: నాలుగేళ్ళు పనిపాటాలేకున్నా పార్టీ వచ్చినందుకు.

నాలుగు చుక్కలు గొంతులో దిగేటప్పటికి ఆత్మశోధన మొదలయ్యింది. ఏమీ సాధించలేదా...!!?? లేదా!!!??? సాధించాను... మా బాసుకి కనిపించకుండా ఆంధ్రజ్యొతి, ఈనాడు చదవటం నాకు తెలిసినట్లు మా ఆఫీసులో ఎవ్వరికీ తెలియదు. ఇంకా... యహూ మెసెంజర్, జిమైలు వాడటం వీటన్నిటిలో మనం మేధావులం కదా! హుర్రే!!! చాలా సాధించాం.

రెండో పెగ్గు:మనం ఎక్చెల్, వర్డు వాడినట్లు ఎవ్వరూ వాడలేదు కదా... అందుకేగా మనం టీం లీడు అయ్యింది... మన పక్కనున్నోళ్ళందరూ పనికిరానొళ్ళని మనమేగా మా మానేజరుకి మందుపోసి మరీ చెప్పింది?? హుర్రే!!! చాలా సాధించాం.

మూడో పెగ్గు:ఆఫ్‌షోరులో ఉన్నప్పుడు ఆన్‌సైటు వాళ్ళని, ఆన్‌సైటు ఉన్నప్పుడు ఆఫ్‌షోరులో వాళ్ళని పనికిరాని వాళ్ళగా చూపించతం మనకి తెలిసినంతగా ఇంకెవరికి తెలుసు?? మనకి రేటింగు ఇవ్వని మేనేజర్ ని బండబూతులు తిట్టటం, మనకి తెలిసినట్లుగా ఇంకెవరికి తెలుసు? హుర్రే!!! చాలా సాధించాం.

3 comments:

రాధిక said...

:)

Purnima said...

హిహి.. మీరు నాల్గేళ్లు ఆగారా అండి.. హుర్రే అని పండగ చేసుకోవటానికి?? రెండేళ్ళలోనే నా సంబరం తీరింది. చించేస్తా, పొడిచేస్తా అని ఈ ఫీల్డ్ కి వచ్చి, ఇప్పుడు మీరు చెప్పినవే ఘనవిజయాలుగా అంగీకరించి, కొనసాగుతున్నా! ;-)

Unknown said...

పూర్ణిమ గారూ! మొదటి సంవత్సరం ప్రాజెక్టు అలకేషన్ జరగలేదు.... రెండవ సంవత్సరం ప్రాజెక్టు అలకేషన్ జరిగినా పనిలేదు... మూడవ సంవత్సరం ప్రాజెక్టులో రాజకీయాలు చేసారు నామీద.... నాలగవ సంవత్సరం ప్రాజెక్టులో నేను రాజకీయాలు చేసాను. :-) ఇదండీ... మన ప్రోగ్రేస్స్... ఎదయితేనేమి నాలాంటి వాళ్ళు నలుగురున్నారంటే హాపీస్ :-)