Friday, August 15, 2008

ఆత్మ కధలు

ఈ మధ్య నా జుట్టు ఎలా ఊడుతుందో అంతకంటే ఎక్కువగా "ఆత్మ కధలు" చూస్తున్నా. మన అద్వానీ గారి దగ్గర నుంచి ప్రక్కన ముషరాఫ్ గారి వరకు. వీళ్ళందరికీ డబ్బులు ఉండబట్టి అచ్చేసుకోగాలుగు తున్నారు... నాకూ కొద్దో గొప్పో డబ్బులుంటే నేనూ అలాగే చేద్దును అన్నాడు మా స్నేహితుడు ఒకడు...

"నా జీవితం చదివి పక్కవాళ్ళు బాగుపడతారు" అని "ఆత్మ కధలు" వ్రాసే మహానుభావులని ప్రక్కన పెడితే... నా ఉద్దేశంలో ప్రతి ఒక్కడికీ తనగురించి పక్క వాడు వినాలని ఉంటుంది. కొంత మంది సొంత డబ్బాతో వినిపిస్తారు... కొద్దిగా రాత తెలిస్తే.. ఇలా పుస్తకాలు రాస్తారు. ఇవి రెండూ చెయ్యలేని వాళ్ళు ముసల్లోల్లయ్యాక "మా కాలం ఐతే ... " అనో లేక "నేను నీ వయసులో ఉన్నప్పుడయితే" అనో మనవాళ్ళ దగ్గర చెప్పుకొంటారు.

మొత్తం మీద ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆత్మ కధల్ని ఎలాకోలాగా చెప్పుకొంటూనే ఉంటారనే నిజం నాకు అర్థమయింది...

1 comment:

Rajendra Devarapalli said...

ముషారఫ్ ఆత్మకధ గురించి నాకు తెలియదు గానీ అద్వానీ ఆటొ బయోగ్రఫీ గురించి ఈమధ్య సమీక్షకులూ,సాహితీ విమర్శుకులూ వేసిన చణుకులూ,ఛలోక్తులూ చాలా బాగున్నాయని అంటున్నారు చదివిన వారు :)