Sunday, December 6, 2009

ఏమంటివి! ఏమంటివి!

ఏమంటివి! ఏమంటివి! ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే???

కాదు.. కాకూడదు.. ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జననమేట్టిది?
అతి జుగుప్సాకరమయిన నీ జననమెట్టిది?

మట్టి కుండలో పుట్టితివికదయ్యా! నీది ఏ కులము?


ఇంత ఏల! అస్మద్పితామహుడు, కురుకుల వ్రుద్దుడయిన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యఐన గంగ గర్భమున జన్మించలేదా? ఈయనదే కులము?


నాతొ చెప్పింతురేమయ్యా! మా వంశమునకు మూలపురుషుడైన వసిష్టుడు దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాడా?


అతడు పంచమ జాతి కన్య ఐన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగనయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచు అయిన మత్స్యగ్రంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాన్డ్రయిన మా పితామహి అంబిక తో మా తండ్రిని, పిన పితామహి అంబాలిక తో మా పిన తండ్రి పాండు రాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మానజనుదని మీచే కీర్తింప బడుతున్న ఈ విదుర దేవుని కనలేదా?


సంధర్భావసరముల బట్టి మా కురువంశము ఏనాడో కులహీనమయినది. కాగా నేడు కులము కులము అను వ్యర్ధ వాదములెందులకు?

పైన చెప్పిన అన్న NTR Dialog గుర్తుంది కదా.... ఆలాంటి పేరడీ మీ కోసం...

ఏమంటివి! ఏమంటివి!

బగ్గు నెపమున ఈ మృదుపరికరణ నిపుణునికి (Software Proffessional)ఇంద కొలువ చెయ్యలేద అర్హత లేదందువా?

ఎంత మాట! ఎంత మాట! !

ఇది యూనిట్ టెస్టింగు (Unit Testing) కానీ, యూసర్ యాసెప్టెన్స్ (User Acceptance Testing) టెస్టింగు కాదే!!

కాదు! కాకూడదు!! ఇందు బగ్సు రాకూదదండువా? ఆ??

అయిన ఈ ప్రాజెక్టు లీడు కోడింగు ఎట్టిది? అతి జుగుప్సాకరమయిన నీ కోడింగు ఎట్టిది? గూగుల్ లో కాపీ కొట్టితివికదా!! నీది ఏమి కోడింగు???

ఇంత ఎల?? మన కంపెనీ పితామహుడు, సాఫ్టువేరు కురువృద్ధుడయిన మన సిఈఓ (CEO) బగ్సు ఫిక్ష్సు చేయలేక వేరే కంపెనీ నుండి పారిపోయి రాలేదా? ఆయనదే కోడింగు??


నాతొ చెప్పింతురేమయ్యా! ఈ కోడింగు మొదలు పెట్టిన నువ్వు వర్షను 1.1 ను, దానిని ఫిక్సు చేసిన నీ టియల్ (TL).. వర్షను 1.2 ను, అందులో బగ్సు ఫిక్ష్సు చేసిన పీయల్(PL).. వర్షను 1.3 ను తయారు చెయ్యలేదా?


సంధర్భావసరముల బట్టి కాష్టు కట్టింగు (Cost Cutting) ప్రాధాన్యతలను బట్టి ఏ కోడు ఏనాడో బగ్సు పరమయినది. కాగా నేడు బగ్గు, బగ్గు అను వ్యర్ధ వాదములెందులకు???

2 comments:

Sandeep said...

bbaagundi :)

venuram said...

అతి జుగుప్సాకరమయిన నీ కోడింగు ఎట్టిది? ha ha..baavundandi..