Sunday, October 25, 2015

సశేషం

ఓవైపు:
పొద్దుటి పూట చద్దికూడు, రాత్రి పూట నిద్ర లొటు,
తిండి కష్టం తెచ్చిన నిద్ర నష్టం, చీడ జాడ్యం,
నీటి ఆరాటం, కరంటు పోరాటం,
వీపున పిచికారీ గొట్టాలు, ఆడ కూలీల గుంపులు...

ఇంకొవైపు:
కోటలు దాటే  మాటలు, అరచేతి స్వర్గాలు,
ఇంద్రభవనాల కలలు, మాఫీలు...నాకొక అవకాశం కావాలి అంతే!
నా వైపు కలలు, రత్నాలు, అరచెతిలొ స్వర్గాలు...
వాళ్ళు దోచుకొన్నారు..      
నేను కాకుంటె అరాచకం, రాళ్ళు, తిప్పలు, దోపిడీ..

ఈవైపు:
ఇక తప్పదు నువ్వే దిక్కు.. నీకే వోటు.

ఆరుగాలం కష్టం, బ్రోకర్ల ఇష్టం, మార్కెట్టు మయాజలం
గిట్టుబాటు రాజకీయం, వారింట్లొ గలగల, వీరింట్లొ విలవిల
అప్పులు, గొప్పలు తెచ్చిన తిప్పలు


ఇక తప్పదు.. నే నాటిన మొక్కకన్నా మృత్యు వృక్షమే గతి
రోదనలు, వేదనలు, మూగిన బంధుమిత్రులు అతణ్ణి విత్తనంలా పాతారు.

ఆ వైపు:
అప్పట్లో అన్నీ అనుకొన్నా.. కానే ఏమి చెయ్యలేం
విమానాల తిరుగుళ్ళకై, రాజకీయ పొరాటాలాకి డబ్బులున్నయ్.
మీకు మాత్రం కష్టం. బీద అరుపులు...
ఇప్పుడు నేనే రాజుని. మీరెవరో గుర్తు లేదు. మనసులో మాట!

దొరికింది ఒక అవకాశం, రక్తావకాశం...
ఇది ఒక అవకాశం... రాజకీయం... శవరాజకీయం
నిరసనలు, దీక్షలు...
మీకు తగిన శాస్తి జరిగింది. నన్ను కాదంటారా?? మనసులో మాట!
 

మరోరోజు - మరల:
పొద్దుటి పూట చద్దికూడు, రాత్రి పూట నిద్ర లొటు

నా వైపు భరోసా, రత్నాలు, అరచేతిలొ స్వర్గాలు
నేను కాకుంటే మోసం, రాళ్ళు, తిప్పలు, నష్టం...
వాళ్ళే దోచుకొన్నారు మొన్నటిదాకా.. నాకొక అవకాశం కావాలి      

ఆరుగాలం కష్టం, బ్రోకర్ల ఇష్టం, మార్కెట్టు మయాజలం
ఇక తప్పదు.. నే నాటిన మొక్కకన్నా మృత్యు వృక్షమే గతి

.......... సశేషం....  

No comments: