Sunday, February 10, 2008

కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్

ఈ పద్యం విన్నారా...? ఎప్పుడైనా..??

"గంజాయి తాగి తురకల
సంజాతుల గూడి కల్లు చవిగొన్నావా
లంజల కొడకా ! యెక్కడ
కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్ | కం | "

పోనీ ఈ పద్యం...????

"రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు గొల్వ పాల్పడి రకటా
సంజయా ! యేమని చెప్పుదు ?
కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్ | కం |"

ఇవి తెనాలి రామకృష్ణ కవి కధలలో చెప్పెవారు నా చిన్నప్పుడు.

ఒకసారి రామకృష్ణ కవి గారిని ఏవిధంగానూ ఎదుర్కోలేక , చివరికి కాపలా వాళ్ళ చేత అవమానింప చెయ్యాలని అనుకొన్నారు మిగతా కవులు. మిగతాకవులిచ్చే లంచాలకి ఆశపడి కాపలా వాళ్ళు కవులిచ్హే సమస్యని రామకృష్ణ కవి గారి ముందు ఉంచటానికి సిద్దపడ్డారు. సమస్య ఎమిటంటే "కుంజర యుధంబు దోమ కుత్తుక జొచ్చెన్".(అంటే ఏనుగుల గుంపు వెళ్ళి దొమ గొంతులో ఇరుక్కొన్నదని అర్థం). దీనిని కవి గారి ముందు సమస్యా పూరణం కోసం ఉంచారు భటులు. రామకృష్ణ కవి గారికి విషయం అర్థమయ్యింది. అందుకని మొదటి పద్యాన్ని వదిలారు....

దాని అర్థం భటులకి బోధపడెలోగా కవిగారు భువనవిజయం వైపు అడుగులు వేసారు. రాయల వారికి ఈ విషయం తెలిసింది. సరే రామకృష్ణులవారి చతురత ఏమిటో చూద్దామని మరల అదే సమస్యనిచ్చారు రాయలవారు. ఈ సారి అడిగింది రాయలవారు, మరలా అదే సమాధానం చెపితే దండన తప్పదని మురిసిపొతున్నారు మిగతా కవులు. కాని రామకృష్ణులవారి చతురత తెలిసిందె కదా! సభలొ ఈ రెండో పద్యం వదిలారు. ఎవ్వరికీ నోటమాట రాలెదు. రాయలవారు స్వయంగా కవిగారిని ఆలింగనం చేసుకొని, రామకృష్ణా "నీ కత్తికి రెండువైపులా పదునే" అని ప్రసంసించారట.

మొదటి పద్య భావం అర్థమయి ఉంటుంది. రెండవపద్య భావం: " (మహాభారతం లోని పాండవులని ఏనుగులతో పొల్చారు). మహా బలవంతులు అయిన పాండవులు, కౌరవుల జూదం లో ఒడిపొయి, ఒక చిన్న సామంత రాజయిన విరాట రాజు (విరాట రాజుని దొమతో పోల్చారు) కొలువు లో అజ్ఞాతవాస సమయం లో పనిచెయ్యవలసి వచ్హింది. ఓ రాజా ఇది ఏనుగుల గుంపు వెళ్ళి దోమ గొంతులో కూర్చొవటం కాక మరేమిటి? "/

3 comments:

chinni20 said...

క్రోత్త తెలుగు సెర్చ్ సైటు
http://www.gults.com/
క్రోత్త తెలుగు సెర్చ్ మీ సైటు కి ఆడ్ చేయండి

చిన్నమయ్య said...

చక్కగా గుర్తు చేసేరు. అభినందనలు.

sai said...

మీ వివ‌రణా శైలి ఉదాత్తం..మా బోటి జానపదుల కు ప్రయూసలేకుండా సునాయాసంగా లబించడం. మాకు ఒక వరం.. మీకు .పాదాభివందనం..