Sunday, December 6, 2009

ఏమంటివి! ఏమంటివి!

ఏమంటివి! ఏమంటివి! ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే???

కాదు.. కాకూడదు.. ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జననమేట్టిది?
అతి జుగుప్సాకరమయిన నీ జననమెట్టిది?

మట్టి కుండలో పుట్టితివికదయ్యా! నీది ఏ కులము?


ఇంత ఏల! అస్మద్పితామహుడు, కురుకుల వ్రుద్దుడయిన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యఐన గంగ గర్భమున జన్మించలేదా? ఈయనదే కులము?


నాతొ చెప్పింతురేమయ్యా! మా వంశమునకు మూలపురుషుడైన వసిష్టుడు దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాడా?


అతడు పంచమ జాతి కన్య ఐన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగనయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచు అయిన మత్స్యగ్రంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాన్డ్రయిన మా పితామహి అంబిక తో మా తండ్రిని, పిన పితామహి అంబాలిక తో మా పిన తండ్రి పాండు రాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మానజనుదని మీచే కీర్తింప బడుతున్న ఈ విదుర దేవుని కనలేదా?


సంధర్భావసరముల బట్టి మా కురువంశము ఏనాడో కులహీనమయినది. కాగా నేడు కులము కులము అను వ్యర్ధ వాదములెందులకు?

పైన చెప్పిన అన్న NTR Dialog గుర్తుంది కదా.... ఆలాంటి పేరడీ మీ కోసం...

ఏమంటివి! ఏమంటివి!

బగ్గు నెపమున ఈ మృదుపరికరణ నిపుణునికి (Software Proffessional)ఇంద కొలువ చెయ్యలేద అర్హత లేదందువా?

ఎంత మాట! ఎంత మాట! !

ఇది యూనిట్ టెస్టింగు (Unit Testing) కానీ, యూసర్ యాసెప్టెన్స్ (User Acceptance Testing) టెస్టింగు కాదే!!

కాదు! కాకూడదు!! ఇందు బగ్సు రాకూదదండువా? ఆ??

అయిన ఈ ప్రాజెక్టు లీడు కోడింగు ఎట్టిది? అతి జుగుప్సాకరమయిన నీ కోడింగు ఎట్టిది? గూగుల్ లో కాపీ కొట్టితివికదా!! నీది ఏమి కోడింగు???

ఇంత ఎల?? మన కంపెనీ పితామహుడు, సాఫ్టువేరు కురువృద్ధుడయిన మన సిఈఓ (CEO) బగ్సు ఫిక్ష్సు చేయలేక వేరే కంపెనీ నుండి పారిపోయి రాలేదా? ఆయనదే కోడింగు??


నాతొ చెప్పింతురేమయ్యా! ఈ కోడింగు మొదలు పెట్టిన నువ్వు వర్షను 1.1 ను, దానిని ఫిక్సు చేసిన నీ టియల్ (TL).. వర్షను 1.2 ను, అందులో బగ్సు ఫిక్ష్సు చేసిన పీయల్(PL).. వర్షను 1.3 ను తయారు చెయ్యలేదా?


సంధర్భావసరముల బట్టి కాష్టు కట్టింగు (Cost Cutting) ప్రాధాన్యతలను బట్టి ఏ కోడు ఏనాడో బగ్సు పరమయినది. కాగా నేడు బగ్గు, బగ్గు అను వ్యర్ధ వాదములెందులకు???

Tuesday, February 3, 2009

కాపీ కవిత ( కౌముది నుంచి )

పొలం గట్టున పనిచేస్తుంటే

చిలక పలుకుల పలకరింపులు!

డొంక దారిలో నడుస్తుంటే

గాలి ఈలల చిలిపి చేష్టలు!

వెనక వస్తూ వేధిస్తావ్!

కంటబడక కవ్విస్తావ్!!

Friday, January 16, 2009

ఏమున్నదక్కొ!! ఓఓ! ఎమున్నదక్కా…

ఈ సరదా పాట చూడండి...

ఏమున్నదక్కొ!! ఓఓ! ఎమున్నదక్కా…
పొట్ట పెరిగిపొయి..జుట్టు రాలిపొయి…
వున్న పరువు పొయి..
ఈ ఇండస్త్రీ లొ నాకింక ఎమున్నది అక్కో.. ఎమున్నది అక్కో ఎమున్నది అక్క..

బి.టెక్కు చేసినాక (సామి)
హైదరాబాదు చేరుకున్నా(సామి)
ఎక్స్పీరియన్సు అడుగుతుంటే ఏఏఏ ఆ ఆఅ ఆఅవ్
ఎక్స్ పీరియన్సు అడుగుతుంటే , ఎంత కావలి అంటే అంత పెట్టి,
జాబ్ కొట్టినా, జాయిన్ అయ్యినా బాంచాన్
(ఏమున్నది అక్కో..)

ట్రైనింగు లు ఇవ్వక పాయె (సామి)
క్లయింటు ఇంటర్యాక్షన్ అన్నడు (సామి)
కమ్యూనికేషను బాలేదు అంటే అ ఆ
ఆఅకమ్యూనికేషను బాలేదు అంటే, కుమిలి కుమిలి ఏడిచినా,
హిందు పేపరు వేయించినా బాంచాన్
(ఏమున్నది అక్కో..)

ప్రాజక్టు ఇచ్చిండు వాడు(సామి)
పేస్లిప్పు కూడ వచ్చింది(సామి)పేస్లిప్పు చూపించీ. అ అ అ అ అ అ
ఆఆఆఆపేస్లిప్పు చూపించిన, క్రెడిట్ కార్డు తీసుకున్న,
అవసరం లేనివి అన్నీ కొన్నా అప్పుల పాలు ఐనా బాంచాన్…
(ఏమున్నది అక్కో..)

ప్రాజక్టు అయిపోఇందీ(సామి)
కొత్తది వస్తాది అన్నడు (సామి)బెంచి లో పెట్టాడు ఆఆ అ ఆ
ఆఆఅబెంచి లో పెట్టినాక సబ్జక్తు మరిచిపోయిన,
ఓ రోజున హెచార్ పిలిచిండు పొయి కలిసినా బాంచాన్….
(ఏమున్నది అక్కో..)

బూం తగ్గింది అన్నాడు (సామి)
కాస్టు కట్టింగ్ అన్నడు (సామి)..
బెంచిలో వున్నా అని చెప్పీ ఆఆ అ అ అ అ
ఆఆబెంచి లో వున్నా అని చెప్పి బయటికి తొసాడు..
కొంప కూల్చాడు బాంచాన్…
(ఏమున్నది అక్కో..)

Sunday, January 11, 2009

తెలుగు బ్లాగు సేవలో పునరంకితమవుతూ...

అందరికి నమస్కారం..... నేను భారత దేశం నుంచి బ్లాగు వ్రాయటానికి సుమారు ౩ నెలలు పట్టింది... ఇంటర్నెట్ లేక అలా జరిగింది. ఇప్పటికి మా పక్కింటి వాళ్ల దయతో ఇంటర్నెట్ వచ్చింది. (మనకి ఇంటర్నెట్ కి బడ్జెట్ సరిపోలేదులెండి). ఇకనుంచి మీ అందరితో ఇంతకముందు లాగా బ్లాగులు వ్రాయటానికి నమ్మకం ఉంది.... తెలుగు బ్లాగు సేవలో పునరంకితమవుతూ...

Wednesday, January 7, 2009

ఏమయింది మన సత్యంకి?

చాలా రోజుల తరువాత మరలా పోస్టు రాస్తున్నా. ఈ మధ్యలో చాలా జరిగాయి... కొన్నింటికి స్పందిద్దామనుకొన్నా! కానీ ఇలా వ్రాయటానికి లాప్-టాప్ లేక ఆగిపోయా... ఏమయింది మన సత్యంకి? అదేనండి రామలింగరాజు గారికి? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు...