Wednesday, June 4, 2008

మాతృ భాష - ప్రాధాన్యత

భారత దేశం నుంచి ఒక కాలేజీ ప్రిన్సిపల్ మాతృ భాష - తెలుగు గురించి తన అభిప్రాయాలు వ్రాశారు. వీలుంటే చదవండి. మాతృ భాష - ప్రాధాన్యత

4 comments:

netizen నెటిజన్ said...

ఆర్యా, శీర్షికలోని అచ్చుతప్పుని సరిదిద్దండి. మత్రు (matru)కాదు మాతృ (maatR)
మనం ఇలాంటి దోషాలు లేకుండా చూసుకోవడం వలన, సరైన భాషను ప్రచారం చెయ్యగలుగుతాము.

Unknown said...

తప్పు జరిగింది. చింతిస్తున్నాను. అది నేను కాపీ పేస్ట్ చేసేటప్పుడు జరిగి ఉండవచ్చు. ఇప్పుడు సరి చేసాను. తప్పుని చూపించినందుకు కృతజ్ఞతలు.

Kathi Mahesh Kumar said...

మాతృభాష గురించి మనలాంటి వాళ్ళు కేవలం కాస్త బాధపడి, మన జీవితాల్లో కాస్త తెలుగుని నింపుకొని స్వాంతనపొందడం తప్ప పెద్దగా చెయ్య గలిగిందిలేదు. ఐదో తరగతికే నన్నయ, తిక్కన పద్యాలు నాచే భట్టీ పట్టించి,తెలుగు అంటే భయపెట్టిన మన తెలుగు భోధనాపద్దతిని మార్చగలమా? ఇంటర్మీడియట్ రాగానే ‘తెలుగులో మార్కులు రావు కన్నా! సంస్కృతం తీసుకో’ అని మన విధ్యార్థులకు చెప్పి, చచ్చిన సంస్కృతాన్ని ప్రోత్సహిస్తూ, మన తెలుగును చంపుతున్న మార్కుల విధానాన్ని పరిమార్చగలమా?

మన తెలుగు భవిష్యత్తును చేతులారా చెడుచుకుంటూ, కాస్త కన్నీరు విడవడమే మన కర్తవ్యంలా ఉంది.

Unknown said...

మహేష్ గారూ!మీరన్నది అక్షరాల నిజం. మీరు ఇక్కడ వ్రాసిన ప్రతి పదం నాకు బాణం లా తగిలింది. నేనూ మీలాగే ఐదో తరగతికే నన్నయ, తిక్కన పద్యాలు భట్టీ పట్టాను. చివరికి ఇంటర్మీడియట్ లో సంస్కృతం తీసుకొన్నాను. తీసుకోకపోతే నేను వెనకబడుతాను కాబట్టి......